Home » మాల్దీవులకు, భారత్ కు మధ్య గొడవ ఏంటి? “బాయ్ కాట్ మాల్దీవ్స్” ను ఎందుకు ట్రేండింగ్ చేస్తున్నారు.

మాల్దీవులకు, భారత్ కు మధ్య గొడవ ఏంటి? “బాయ్ కాట్ మాల్దీవ్స్” ను ఎందుకు ట్రేండింగ్ చేస్తున్నారు.

by Srilakshmi Bharathi
Ad

ఇటీవల భారత ప్రధాని మోడీ లక్ష ద్వీప్ ను సందర్శించి.. అక్కడ తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఇవి మాల్దీవ్స్ లో ఊహించని మంటకి తెరలేపాయి. దానికి కారణం.. గత కొన్ని రోజులుగా మాల్దీవ్స్ కు, భారత్ కు మధ్య గొడవ రాజుకోవడమే. వివరాల్లోకి వెళితే మాల్దీవ్స్ లో గతంలో మహ్మద్ నషీద్ ప్రభుత్వం అధికారంలో ఉండేది. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో ఈ ప్రభుత్వం అధికారం కోల్పోయి చైనా అనుకూల అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు అధికారం లోకి వచ్చారు. ఈయన వచ్చిన వెంటనే మాల్దీవ్స్ నుంచి భారత్ సైన్యాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.

Advertisement

ఇందులో చైనా హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. చైనా కూడా ఈయనను అడ్డం పెట్టుకుని భారత్ ప్రభుత్వాన్ని ఎదిరించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మహమ్మద్ మయిజ్జు భారత వ్యతిరేక వ్యక్తిగా.. చైనా అనుకూల వ్యక్తిగా ముద్రపడిన నాయకుడు. ఈ ప్రభుత్వం అధికారం లోకి వచ్చినప్పటి నుంచి భారత్ ప్రభుత్వంపై మాల్దీవ్స్ నుంచి వ్యతిరేకత మొదలైంది. నిజానికి భారత్ మాల్దీవ్స్ కు చాలానే సాయం చేస్తూ వచ్చింది. అందుకే మాల్దీవ్స్ ప్రజలు భారత్ ప్రభుత్వంతో స్నేహాన్నే కోరుకుంటారు.

Advertisement

కానీ మయిజ్జు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భారత్ తో స్నేహం తగ్గిందనే చెప్పాలి. ఓ వారం రోజుల క్రిందట భారత్ ప్రధాని మోడీ లక్షద్వీప్ ను సందర్శించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే.. ఈ ఫోటోలను చూసి చాలా మంది లక్షద్వీప్ భారత్ దేశపు మాల్దీవ్స్ గా పేర్కొంటూ కామెంట్ చేసారు. ఈ క్రమంలో మాల్దీవ్స్ కు చెందిన ముగ్గురు నేతలు వంకరగా స్పందించారు. అంతే కాకుండా భారత్ పైనా, మోడీ పైనా నెగటివ్ కామెంట్స్ చేసారు. దీనితో వివాదం మరింత ముదిరి బాయ్ కాట్ మాల్దీవ్స్ అంటూ ట్విట్టర్ లో ట్రేండింగ్ చేయడం వరకు వచ్చింది. పలువురు సెలెబ్రిటీలు మాల్దీవ్ ప్రభుత్వం తీరుపై ఘాటుగానే స్పందించారు. స్వదేశీ బీచ్ లు , పర్యాటక ప్రదేశాలు సందర్శించి దేశ పర్యాటక వ్యవస్థకు తోడ్పాటునందించాలి అంటూ పిలుపునివ్వడం స్టార్ట్ చేసారు. దీనితో మాల్దీవ్స్ కు తన తప్పు తెలిసొచ్చింది. ఇప్పుడు ఆ ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించి.. నష్ట నివారణ చర్యలు చేపట్టింది.

 తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading