Home » చిరంజీవి హనుమాన్ లాకెట్ ని ఎవరు దొంగలించారంటే..?

చిరంజీవి హనుమాన్ లాకెట్ ని ఎవరు దొంగలించారంటే..?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇండస్ట్రీలో అంచెలంచెలుగా ఎదుగుతూ మెగాస్టార్ గా ఎదిగారు. అయితే చిరంజీవి ఆంజనేయుడి భక్తుడు.  సాధారణంగా  ఆయన ఏ పని చేయాలన్నా ముందు ఆంజనేయస్వామిని తలుచుకుంటారు. అంతేకాదు.. ఆయనకి ఏదైనా సమస్య వస్తే రాత్రి ఆ దేవుడితో చెప్పుకుంటారట.  ఇక ఉదయానికి ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందట. ఇక ఈ విషయాలన్నీ తేజా సజ్జా హీరోగా చేసిన హను-మాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి బయట పెట్టారు.

Advertisement

అయితే చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఆయన మెడలో ఒక హనుమాన్ లాకెట్ ఉండేది.  అయితే ఆ లాకెట్ ని ఎవరో దొంగలించారట. మరి దాన్ని దొంగలించింది ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. చిరంజీవి యాక్టింగ్ నేర్చుకోవడానికి చెన్నై ఫిల్ ఇన్స్టిట్యూట్ కి వచ్చేముందు తన ఇంటి పెరట్లో ఒక హనుమాన్ లాకెట్ దొరికిందట. దాన్ని తన తండ్రి మెడలో చైన్ కి వేశారట.ఇక ఎప్పుడైతే ఆ లాకెట్ చిరంజీవి మెడలో వేసుకున్నారో అప్పటి నుండి ఆయనకు అన్ని శుభాలే జరిగాయట.  అంతేకాదు చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నటించిన సినిమాలన్నింటిలో ఆయన మెడలో ఆ లాకెట్ కనిపించేది. ఇక ఆయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చెన్నైలోని ఓ డబ్బింగ్ స్టూడియోలో తన మెడలో ఉన్న ఆ హనుమాన్ లాకెట్  మిస్ అయిందట. దాంతో చాలా కంగారుపడి ఎక్కడ పోయిందో అని చిరంజీవి ఎంతగానో బాధపడ్డారట.కానీ ఆ తర్వాత రెండు రోజులకి మళ్లీ అదే లాకెట్ ఆ స్టూడియోలోనే కనిపించిందట.

Advertisement

మళ్ళీ చిరంజీవి దాన్ని మెడలో వేసుకున్నారట.కానీ “అన్నయ్య ” సినిమా షూటింగ్ సమయంలో ఆ లాకెట్ ని తీసేయమని అడిగితే సినిమా కోసమని ఆ లాకెట్ ని చిరంజీవి తీసి అక్కడే ఉన్న వ్యక్తికి ఇచ్చారట.ఇక తర్వాత షూటింగ్ అయిపోయాక లాకెట్ తీసుకుందామని చూస్తే ఆ వ్యక్తి ఎక్కడ కూడా కనిపించలేదట. దాంతో లాకెట్ మిస్ అయినందుకు చిరంజీవి ఎంతగానో బాధపడ్డారట. కానీ ఆ తర్వాతే ఆయన రియలైజ్ అయ్యి భక్తి అనేది మన మనసులో దేవుడిపై ఉండాలి..కానీ మనం వేసుకునే గొలుసులో,లాకెట్ లో ఉండకూడదు అని అనుకున్నారట. ఇక ఈ విషయాన్ని స్వయంగా బయట పెట్టిన చిరంజీవి ఆ లాకెట్ ని ఎవరు దొంగలించారు అనేది మాత్రం బయట పెట్టలేదు. ప్రస్తుతం చిరంజీవి చేసిన కామెంట్లు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading