Home » యానిమల్ మూవీలో రణబీర్ కి సోదరిగా నటించింది ఎవరంటే..?

యానిమల్ మూవీలో రణబీర్ కి సోదరిగా నటించింది ఎవరంటే..?

by Anji
Ad

తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా డైరెక్టర్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఇక బాలీవుడ్ లోకి   షిఫ్ట్ అయ్యి అదే సినిమాను కబీర్ సింగ్ పేరుతో డైరెక్ట్ చేసి రిలీజ్ చేసి  అక్కడ కూడా హిట్ కొట్టాడు. ముఖ్యంగా టాలీవుడ్ లోఅర్జున్ రెడ్డి మూవీతో హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. దీని తర్వాత ఎన్ని సినిమాలు చేసినా సరే అందరూ సందీప్ ను అర్జున్ రెడ్డి డైరెక్టర్ అనే పిలుస్తూ వస్తున్నారు. ఆ రేంజ్లో బాక్సాఫీస్ ను షేక్  చేసిందీ మూవీ.

Advertisement

అయితే సందీప్ రెడ్డి ఈసారి అంతకు మించి వయోలెన్స్ చూపించేందుకు సిద్ధమయ్యాడు. యానిమల్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన్నా హీరో, హీరోయిన్లుగా నటించారు. సుమారు మూడున్నర గంటల నిడివితో ఉన్నా యానిమల్ చిత్రం యొక్క ట్రైలర్ ఇటీవలే రిలీజ్ అయింది.  అది తెగ వైరల్ అయింది. ఇందులో బాబి డియోల్, అనిల్ కపూర్, సురేష్ ఒబెరాయ్ సోదరిగా నటించిన నటి బడా స్టార్స్ నటించారు. అయితే రణబీర్ సోదరిగా నటించిన  ఈ నటి ఎవరు అని అందరూ ఆరా తీస్తున్నారు. ఆమె ఎవరో  ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement


హీరో సోదరిగా నటించిన ఆమె పేరు సలోని బాత్రా.  ఈమె పుట్టింది ఢిల్లీలో.. చదివింది చెన్నైలో..  అయితే ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకున్న సలోని మొదటి డిజైనింగ్ నేర్చుకున్న మాలిని అగర్వాల్ దగ్గర స్టైలిస్ట్ గా చేరింది. 2013లో ద అన్ మ్ డ్ షార్ట్ ఫిలింలో నటించింది. ఇక ఆ తర్వాత బుల్లితెరపై లైఫ్ సహీ హై సీరియల్ లో నటించింది. ఈ సిరీస్ లో సహా పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నా ఆమె షార్ట్, ఫీచర్ ఫీలింస్ చేసింది. పర్చాయే: గోస్ట్ స్టోరీస్, వైట్ మ్యాటర్స్,  తైష్ వంటి పలు  సినిమాల్లో  నటించింది. ప్రస్తుతం ఆమె యానిమల్ కాకుండా 200 హల్లా హో, ద నాట్ వంటి సినిమాలు చేస్తోంది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading