విశ్వనటుడు, యూనివర్సర్ స్టార్ హీరో, రైటర్, సింగర్, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ కమల్ హాసన్ ఇండస్ట్రీకి బాల నటుడిగా పరిచయమయ్యాడు. దాదాపు 5 దశాబ్దాలకు పైగా కెరీర్ కొనసాగిస్తున్నారు. ఆయన చేయని ప్రయోగాలు అంటూ లేవు. నటనతో ప్రాణం పోసిన పాత్రలు చేయడం మహా అద్భుతం. తెలుగు, తమిళంలో స్టార్ హీరోగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు కమల్ హాసన్.
Advertisement
ప్రొఫెషనల్ గా కమల్ కింగ్ అయితే.. పర్సనల్ లైఫ్ విషయానికొస్తే మాత్రం చాలా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. అధికారికంగా రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. చాలా మందికి రెండు పెళ్లిళ్లు, ఓ సహజీవనం గురించి మాత్రమే తెలుసు. కానీ తెలియని విషయాలు చాలానే ఉన్నాయి. తొలుత కమల్ హాసన్ శ్రీ విద్యను ప్రేమించానని చెప్పి, పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చారట. ఈ విషయం స్వయంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. “మేము ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మా రెండు కుటుంబాలు చాలా ఏళ్లుగా ఒకరికొకరం తెలుసు. మా అమ్మ ప్రముఖ కర్ణాటక సంగీత గాయనిమని ఎం.ఎల్. వసంత కుమారి. మా పేరెంట్స్ మధ్య గొడవలు వచ్చి నా చిన్నప్పుడే విడిపోయారు. నేను 13 ఏళ్లకే సినిమాల్లో చేరాను. కమల్ హాసన్ నన్ను ప్రేమిస్తున్నాడని చెప్పే సమయానికి నా వయస్సు 22 ఏళ్లు. ఆమాట ఆయన అన్నప్పటి నుంచి మనసా వాచా ఆయనను ఆరాధించడం, ఆయన కోసమే బతకాలని, నా జీవితాన్ని ఆయనకే అంకితం చేయాలని ఎదురుచూశాను. కానీ ఆరోజు రానే లేదు.
Advertisement
Also Read : పవన్ కళ్యాణ్ నుంచి దళపతి వరకు వారి కెరీర్ లో అత్యధిక రీమేక్ తీసిన 7 స్టార్ హీరోలు
అకస్మాత్తుగా మొదటి భార్య వాణి గణపతిని పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పాడు కమల్. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. ఈ పెళ్లి జరగాల్సిందే.. కానీ నా కోసం ఎదురు చూడు అన్న ఆ హీరో మాటలు ఇప్పటికి నాకు గుర్తు” అని చెప్పుకొచ్చారు శ్రీ విద్య. కమల్ హాసన్ తరువాత ఎక్కువగా లేడీ ఓరియెంటేడ్ సినిమాలు చేసిన దర్శకుడు భరతన్ తో కొద్ది రోజుల పాటు రిలేషన్ లో ఉంది. అతనితో బ్రేకప్ తరువాత.. మలయాళ పరిశ్రమకు చెందిన జార్జ్ థామస్ ని పెళ్లి చేసుకుంది. కానీ కొద్ది కాలానికే వారు విడిపోయారు. గొడవలు, కేసులు, వివాదాలతో ఆమె విసిగిపోయింది. 2003లో స్పైన్ క్యాన్సర్ కి గురైన శ్రీవిద్య 2006లో తిరిగిరాని లోకాలకు వెళ్లారు. అప్పటికే ఆమె తన ఆస్తిని ఛారిటీకి రాసిచ్చారు.
Also Read : విరాట్ కోహ్లీ బయోపిక్ లో రామ్ చరణ్!