Home » 3 కోట్లు పెట్టి “రకుల్” కు ఇల్లు కొనిచ్చిన హీరో ఎవరంటే..?

3 కోట్లు పెట్టి “రకుల్” కు ఇల్లు కొనిచ్చిన హీరో ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీ లోనే మోస్ట్ బ్యూటిఫుల్ గ్లామరస్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటికి ఎన్నో సినిమాల్లో నటించి తన అందచందాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఈ అమ్మడు. టాలీవుడ్ క్రేజీ బ్యూటీ గా ఎంతో సక్సెస్ పొందారు. చిన్న మూవీస్ తో మొదలైన ఈ అమ్మడు కెరియర్, పెద్ద పెద్ద స్టార్ హీరోలతో నటించే రేంజ్ కి వెళ్ళిపోయింది. తన కెరియర్ చాలా విజయవంతంగా దూసుకుపోతున్న ఈ తరుణంలో, ఒక చిన్న వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వార్త నన్ను చాలా బాధ పెట్టిందని ఆమె తెలియజేసింది. ఒక స్టార్ హీరో నాకు ఇల్లు కొని ఇచ్చాడని న్యూస్ వైరల్ అవ్వడం నాకు చాలా బాధగా ఉందని అంటోంది రకుల్.

Advertisement

అయితే సినిమా ఇండస్ట్రీలో హీరో మరియు హీరోయిన్ అన్న తర్వాత రూమర్లు రావటం అనేది చాలా సహజం. ఎఫైర్లు ఉన్నాయని న్యూస్ రావడం కామన్ గా తీసుకోవచ్చు కానీ, ఏకంగా ఇల్లే కొనిచ్చారు అని చెప్పి వార్తలు రావడం అనేది చాలా ఇబ్బంది పెట్టాయని, ముఖ్యంగా తమ కుటుంబ సభ్యులు ఈ వార్త చూసి చాలా బాధపడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది రకుల్ ప్రీత్ సింగ్. ఒక ఇల్లుకొనిచ్చే బాయ్ ఫ్రెండ్ నాకు ఉన్నాడు అనేది గర్వ కారణంగా చెప్పుకోవచ్చు కానీ, అలాంటి స్నేహితుడు నాకు ఉన్న ఫ్రీగా ఇస్తే నేను తీసుకోను అని చెబుతోంది.

Advertisement

మూడు కోట్లు పెట్టి నాకు ఇల్లు కొని ఇచ్చాడు అనే వార్త నన్ను చాలా ప్రభావితం చేసిందని, నేను కష్టపడి ఇల్లు కొనుక్కుంటే హీరో కొనిచ్చాడు అని ఈ వార్తలు రావడం షాకింగ్ కు గురి చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్క సినిమాకు కోటీకి పైగా తీసుకుంటున్న ఈ అమ్మడు, ఇంకొకరిని అడిగి ఇల్లు తీసుకోవాల్సిన అవసరం ఏముందని తన అభిమానులు అంటున్నారు.

also read;

నాకు ఆ అలవాటు లేదంటూ క్లారిటీ ఇచ్చిన పవిత్ర లోకేష్.!!

చిరును ఇబ్బంది పెట్టిన ఇద్దరు స్టార్ హీరోయిన్లు.. చివరికి ఆ రూమ్ లోకి పిలిచి.. ఏం..?

 

Visitors Are Also Reading