Telugu News » చిరును ఇబ్బంది పెట్టిన ఇద్దరు స్టార్ హీరోయిన్లు.. చివరికి ఆ రూమ్ లోకి పిలిచి.. ఏం..?

చిరును ఇబ్బంది పెట్టిన ఇద్దరు స్టార్ హీరోయిన్లు.. చివరికి ఆ రూమ్ లోకి పిలిచి.. ఏం..?

by Sravanthi Pandrala Pandrala

తెలుగు ఇండస్ట్రీ లోనే మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక గొప్ప నటుడిగా ఎంతో పేరుతో పాటుగా,గౌరవ మర్యాదలు కూడా సంపాదించుకున్నారు. ఆయన తెలుగు ఇండస్ట్రీలో అలనాటి హీరోయిన్స్ అందరితోనూ నటించారు. ఆయన నటించిన ప్రతి హీరోయిన్ తో స్నేహపూర్వకంగా మెదులుతూ ఉంటారు. ఆయన కొంత మంది హీరోయిన్లతో చేస్తే మాత్రం తప్పనిసరిగా సక్సెస్ సాధిస్తారని టాక్ కూడా వచ్చింది. ఇంకొంత మంది హీరోయిన్స్ లో నటిస్తే అబ్బో జోడీ సెట్ కాలేదని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇన్ని సంవత్సరాల నటజీవితంలో మెగాస్టార్ చిరంజీవితో గొడవ పడ్డ హీరోయిన్లు ఇద్దరు ఉన్నారు. కెరియర్ మొదట్లో చిరంజీవితో దాదాపుగా పది సినిమాల్లో నటించిన నటి మాధవి. ఆయన టాప్ హీరో గా కొనసాగుతున్న సమయంలో చిరును ఎదిరించిన నటి నగ్మా. చిరంజీవి మొదటి చిత్రం ప్రాణం ఖరీదు, మూవీ లో మాధవి గెస్ట్ రోల్ లో కనిపించింది. ఇక ఆ సినిమా షూటింగ్ నుంచే మాధవికి చిరంజీవి అంటే ఎందుకో చులకన భావం ఏర్పడిందట.

Ads

 

దీని తర్వాత కుక్క కాటుకు చెప్పు దెబ్బ, కోతల రాయుడు, వీరిద్దరి కాంబినేషన్లో వచ్చాయి. అయితే వీరిద్దరూ మాత్రం సెట్ లో మాట్లాడుకునే వారు కాదట. దీని తర్వాత వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, ఖైదీ, మూవీస్ లో నటించిన సమయంలో కూడా వీరిద్దరి మధ్య మాటలు లేవు. అయినా కానీ చిరంజీవి మాధవితో నటించను అని, మాధవి చిరుతో నటించను అని నిర్మాతలతో కానీ, డైరెక్టర్లతో కానీ ఎప్పుడూ కూడా చెప్పలేదట. అయితే తన స్నేహితురాలు సురేఖతో చిరంజీవి పెళ్లి అయిన తర్వాత మాధవి ప్రవర్తనలో మార్పు వచ్చింది. సురేఖను చిట్టెక్క అని పిలిచేవారట మాధవి. తర్వాత కాలంలో చిరంజీవి గారు తన భావ అవ్వడంతో ఆయనతో స్నేహాన్ని పెంచుకొంది మాధవి. ఇక హీరోయిన్ నగ్మా విషయానికి వస్తే చిరంజీవి పక్కన మూడు సినిమాల్లో నటించారు. అందులో ఘరానా మొగుడు, బ్లాక్ బస్టర్ హిట్ అయింది. రిక్షావోడు, ముగ్గురు మొనగాళ్లు, అంతగా ఆడ లేకపోయాయి. అయితే ఘరానా మొగుడు మూవీ లో హీరోయిన్ గా విజయశాంతి నటించాలి.

ఆమె డేట్స్ కుదరకపోవడంతో నగ్మాని తీసుకున్నారు. అప్పటికి ఆమె తెలుగు ఇండస్ట్రీ లో ఒకే ఒక మూవీస్ లో చేసింది. అదికూడా పెద్దింటి అల్లుడు. ఒక కొత్త హీరోయిన్ తమ అభిమాన హీరోని “ఏంది బే ఎట్టాగ ఉంది ఒళ్ళు” అని అంటుంటే మెగా ఫ్యాన్స్ కు కోపం వచ్చిందట. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టడంతో నగ్మా జాతకమే మారిపోతుంది. ఇక పెద్ద పెద్ద హీరోలతో నటించే అవకాశం వచ్చింది. ఇదంతా తన ప్రతిభ అనుకొని మురిసిపోయింది నగ్మా. అయితే చిరంజీవి గారి సొంత చిత్రం ముగ్గురు మొనగాళ్లు సినిమాలో మాత్రం నగ్మా మళ్ళీ హీరోయిన్ గా వచ్చింది. కానీ ఆ సినిమా షూటింగ్ లో నగ్మా చివరి సమయంలో నడుం పట్టేసింది అంటూ డుమ్మ కొట్టిందట. దీంతో ఆమె డూప్ ను పెట్టి షూటింగ్ పూర్తి చేసారట. అయినా చిరంజీవి కోపానికి రాకుండా నగ్మాకు రిక్షావోడు సినిమాలో మరో అవకాశం కూడా ఇచ్చారట. అయినా నగ్మా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో, ఒకరోజు మెగాస్టార్ నగ్మా ను మేకప్ రూములోకి పిలిచి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తోంది.

aslo read;

ఛార్మి తో పూరి ? భార్యకి విడాకులు ఇవ్వనున్నారా ? ఆకాష్ పూరి రియాక్షన్ ఇదే…!

గీతాంజలి సినిమాలో నటించిన హీరోయిన్ గుర్తుందా ? ఇప్పుడెక్కడ ఉందంటే ?


You may also like