రెండు రోజుల కిందట కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ..కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కొత్త చరిత్ర సృష్టించింది. రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర, సోనియాగాంధీ రాజకీయ వ్యూహాలు, ప్రియాంక గాంధీ కృషి, సిద్ధరామయ్య ఇమేజ్, డీకే శివకుమార్ కష్టం… కార్యకర్తల ఇష్టం… ఇవన్నీ కలిపి కాంగ్రెస్ కు గెలుపు బాటలు వేశాయి. భారత జాతీయ కాంగ్రెస్… కర్ణాటకలో 224 అసెంబ్లీ నియోజకవర్గాలలో 136 స్థానాల్లో స్పష్టమైన మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చింది.
Advertisement
ఇక బుధవారం కర్ణాటక సీఎం ఎవరు అనేది తెలియనుంది. అయితే… కాంగ్రెస్ విజయం వెనుక మాస్టర్ మైండ్ సునీల్ కనుగోలు ఉన్నారు. ఆయనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త. అన్ని తానై నడిపించిన ఎన్నికల స్ట్రాటజిస్టు సునీల్. కర్ణాటకలో కాంగ్రెస్ కొత్త వ్యూహాలను రూపొందించారు. బిజెపి ఎత్తులకు పై ఎత్తులు వేశారు. ఎన్నికల వ్యూహకర్తగా సునీల్ ను కాంగ్రెస్ పార్టీ గత ఏడాది మార్చిలో నియమించుకుంది.
Advertisement
రెండు నెలల తర్వాత సోనియా గాంధీ సునీల్ ను పార్టీ 2024 లోక్సభ ఎన్నికల టాస్క్ ఫోర్స్ లో సభ్యునిగా నియమించారు. గతంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో కలిసి పనిచేసిన సునీల్ కనుగోలు 2014లో నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషించారు. విజయవాడకు చెందిన సునీల్ కనుగోలు కుటుంబం చాలా ఏండ్ల క్రితమే తమిళనాడులో స్థిరపడింది. అమెరికాలో ఉన్నత చదువులు పూర్తి చేసిన సునీల్….ప్రపంచ దిగ్గజ సంస్థ మేక్ కిన్సీలో కన్సల్టెంట్ గా పనిచేశారు. ప్రశాంత్ కిషోర్ ను ఎలా అయితే ‘పీకే’ గా పిలుస్తారో… సునీల్ కనుగోలును ‘ఎస్కే’ అనే పొట్టి పేరుతో పిలుస్తారు.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
Adah Sharma: రోడ్డు ప్రమాదంలో ఆదాశర్మకు తీవ్ర గాయాలు.. అసలు ఏమైంది
Sunisith : ఉపాసన తో గోవాకు సునిశిత్…చితక్కొట్టిన మెగా ఫ్యాన్స్!
భీమ్లా నాయక్ సినిమాకు జగన్ వల్ల రూ. 30 కోట్లు నష్టం వచ్చిందా ?