Home » వెంకీ మామ కు సూట్ అయినా టాప్-5 హీరోయిన్స్ వీరేనా..!!

వెంకీ మామ కు సూట్ అయినా టాప్-5 హీరోయిన్స్ వీరేనా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఇచ్చిన పాత్రల్లో ఒదిగిపోవడం, డాగ్ చేతనైనా, ఎద్దు చేతనైనా కన్నీళ్లు పెట్టించగల సెంటిమెంట్ సీన్లలో జీవించేయడం ఇలా కళాకారుడు అన్న పేరుకు సరైన నిర్వచనంగా ఉంటాడు వెంకటేష్. మరి అలాంటి ఈ కళా కృష్ణ కి ఒక మెరుపులా ఈయన పక్కన బాగా సూట్ అయిన హీరోయిన్స్ ఎవరనేది ఇప్పుడు చూద్దాం.సౌందర్య: వెంకీ పక్కన హీరోయిన్ అనగానే ఠక్కున గుర్తొచ్చే పేరు సౌందర్య. ఇద్దరూ కలిసి అరడజను వరకు సినిమాలు చేశారు. పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం రా, రాజా, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, జయం మనదేరా ఇలా వీరి కాంబినేషన్ లో వచ్చి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచాయి. ఇద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కి వందకు వంద మార్కులు వేసేయచ్చు.కుష్బూ : ఈ ఫ్యామిలీ హీరోకి బాగా కలిసొచ్చిన మరో హీరోయిన్ కుష్బూ. కెరీర్ ప్రారంభంలో వెంకీ తో కలిసి మంచి విజయాలు అందించిన హీరోయిన్ ఈమె. వెంకీ తొలి మూవీ కలియుగ పాండవులు, భారతంలో అర్జునుడు ఇలా వీరి కాంబో కి అప్పుడు మంచి పేరు వచ్చింది.మీనా : చంటి సినిమా తో వీరి చూడ ముచ్చటైన జంట సుందరకాండ, అబ్బాయిగారు, దృశ్యం, దృశ్యం-2 సినిమాల వరకు కొనసాగి మంచి పేరు తీసుకు వచ్చి పెట్టింది. చంటి సినిమాలో వెంకీ అమాయకుడిగా నటించి ఆకట్టుకుంటే, సుందరకాండ లో మీనా అమాయకురాలు గా నటించి ఆకట్టుకుంది.విజయశాంతి: శత్రువు,సూర్య ఐపిఎస్, చిన్న రాయుడు సినిమా లో ఈ జంట మెరిసింది. లేడీ అమితాబ్ బచ్చన్ లాంటి విజయశాంతి తో శత్రువు సినిమాలో వీరి మధ్య పోటాపోటీ యాక్టింగ్ ఆకట్టుకుంటుందిఆర్తి అగర్వాల్ : వసంతం, నువ్వు నాకు నచ్చావ్, సంక్రాంతి సినిమాలతో ఈ జంట సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా నువ్వు నాకు నచ్చావ్ సినిమా లో వీరి మధ్య కెమిస్ట్రీ అయితే ఆద్యంతం ఆకట్టుకుంటూ మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంటుంది.

Advertisement

ALSO READ;

Advertisement

ఆర్ఆర్ఆర్ మూవీలో ఈ చిన్న లాజిక్ మీరు గుర్తించాలి.. ఆ జెండాలో ఏం..?

విక్ట‌రీ వెంక‌టేష్ కూతురుని ఎప్పుడైనా చూశారా..? హీరోయిన్ల‌ను మించిన ఫాలోయింగ్ ఆమె సొంతం..!

 

Visitors Are Also Reading