Home » చిరంజీవికి ముచ్చమటలు పట్టించిన ‘వెంకటేష్’ సినిమా! దెబ్బకి రికార్డ్స్ బద్దలు!

చిరంజీవికి ముచ్చమటలు పట్టించిన ‘వెంకటేష్’ సినిమా! దెబ్బకి రికార్డ్స్ బద్దలు!

by Bunty
Published: Last Updated on
Ad

మెగాస్టార్ కెరీర్ లో వచ్చిన బెస్ట్ సినిమాలలో గ్యాంగ్ లీడర్ ఒకటి. 1991 లో విజయ బాపినీడు దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఈ సినిమాలో చిరంజీవికి జోడిగా విజయశాంతి హీరోయిన్గా నటించింది. ఈ సినిమా చిరంజీవికి మాస్ ఆడియన్స్ లో క్రేజ్ పెంచింది. బాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పిలహరి మ్యూజిక్ అందించడంతో ఈ సినిమా పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఎన్నో హైలెట్స్ తో ఈ సినిమా 1991 లో ఆ సంవత్సరం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

READ ALSO : IPL 2023 : టైటిల్ రేసులో నాలుగు జట్లు… వీటిలో ఒక జట్టుకే కప్పు గెలిచే ఛాన్స్…ఏవంటే?

Advertisement

 

ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత అందరూ గ్యాంగ్ లీడర్ మూడ్ లో ఉంటే వెంకటేష్ బొబ్బిలి రాజా సినిమాతో వచ్చాడు. స్టార్ డైరెక్టర్ బి.గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈసారి వెంకటేష్ మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రవి రాజా పినిశెట్టి దర్శకత్వంలో చంటి అనే సినిమాలో నటించాడు. ఈ చిత్రంలో వెంకటేష్ కు జోడిగా మీనా నటించింది. ముఖ్యమైన పాత్రలో నాజర్ నటించారు. ఇళయరాజా ఈ సినిమాకు స్వరాలు సమకూర్చగా సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి.

Advertisement

READ ALSO : మెగా కోడలు ఉపాసన మరో ఘనత… ఆసియా మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్ గా…!

1991 లో విడుదలైన ఈ సినిమా ఏడు కోట్ల షేర్ వసూలు చేసిన చిరంజీవి గ్యాంగ్ లీడర్ సినిమాను అధిగమించింది. చంటి సినిమా ఏకంగా తొమ్మిది కోట్ల షేర్ వసూలు చేసింది. అంతేకాకుండా 1992లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాను బీట్ చేస్తూ ఘరానా మొగుడు సినిమా 10 కోట్ల షేర్ వసూలు చేసి అదే సంవత్సరం మరో ఇండస్ట్రీ హిట్ గా నిలవడం విశేషం. ఘరానా మొగుడు సినిమాతో చిరంజీవి మాస్ ఇమేజ్ మరింత పెరిగింది.

READ ALSO : కోలీవుడ్ స్టార్ హీరో తో మీనా రెండో పెళ్లి..?

Visitors Are Also Reading