Home » మెగా కోడలు ఉపాసన మరో ఘనత… ఆసియా మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్ గా…!

మెగా కోడలు ఉపాసన మరో ఘనత… ఆసియా మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్ గా…!

by Bunty
Ad

మెగా పవన్‌ స్టార్‌  రామ్ చరణ్,ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ గుడ్ న్యూస్ ను మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ వీరికి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే ఉపాసన సరోగసి ద్వారా బిడ్డను కనబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అచ్చం నయనతార లాగే ఉపాసన కూడా చేస్తుందని, అందుకే ఉపాసన సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేదంటూ వార్తలు వచ్చాయి.

READ ALSO : IPL 2023 : టైటిల్ రేసులో నాలుగు జట్లు… వీటిలో ఒక జట్టుకే కప్పు గెలిచే ఛాన్స్…ఏవంటే?

Advertisement

 

కాగా, ఈ మెగా కోడలు ఉపాసన విశిష్ట ఘనతను అందుకున్నారు. ఎకనామిక్ టైమ్స్ రూపొందించిన మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ జాబితాలో ఉపాసనకు స్థానం లభించింది ఆసియా స్థాయిలో 2022-23 సంవత్సరానికి గాను ఈ జాబితా ప్రకటించారు. ఓ కార్యక్రమంలో ఉపాసన పేరును అధికారికంగా వెల్లడించారు. వివిధ రంగాల్లో ఉపాసన అందిస్తున్న సేవలు, రాణిస్తున్న తీరుకు గుర్తింపుగా ఆమె పేరును జాబితాలో చేర్చినట్టు ఎకనామిక్ టైమ్స్ వెల్లడించింది.

Advertisement

READ ALSO : Manchu Manoj-Manchu Vishnu : మంచు మనోజ్ ఇంటిపై మంచు విష్ణు దాడి.. వీడియో షేర్ చేసిన హీరో

దీనిపై ఉపాసన స్పందించారు. ఆసియా మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ లో ఒకరిగా తనను గుర్తించినందుకు ఎకనామిక్ టైమ్స్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు ట్వీట్ చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ను పెళ్లాడక ముందు నుంచే ఉపాసన అపోలో ఆసుపత్రుల అనుబంధ విభాగాల కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. అనంతరం అపోలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ గా సామాజిక సేవల రంగంలో విజయవంతంగా పురోగమిస్తున్నారు.

READ ALSO : భర్త వేరే అమ్మాయితో… తిరుగుతున్నప్పుడు భార్య ఏం చేయాలి..!

Visitors Are Also Reading