Home » ప్లే ఆఫ్స్ కు వరుణుడు అడ్డుపడితే ఏం జరుగుతుంది..?

ప్లే ఆఫ్స్ కు వరుణుడు అడ్డుపడితే ఏం జరుగుతుంది..?

by Azhar
Ad

ఐపీఎల్ 2022 చివరి దశకు వచ్చింది. ఈరోజు నుండి ప్లే ఆఫ్స్ ప్రారంభమవబోతున్నాయి. ఈ ఏడాది రెండు కొత్త జట్ల రాకతో 10 జట్లు పోటీ పడగ.. అందులో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్, లక్నో జట్లతో పాటుగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్లు ఏ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాయి. ఇక ఈరోజు క్వాలిఫైర్ 1 లో భాగంగా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ జట్లకు మ్యాచ్ జరగనుంది. ఇందులో విజయం సాధించిన జట్టు నేరుగా.. ఫైనల్స్ కు వెళ్తే ఓడిన జట్టు క్వాలిఫైర్ 2 కి వస్తుంది.

Advertisement

అయితే లీగ్ మ్యాచ్ లు మొత్తం ముంబైలో జరిగిన ప్లే ఆఫ్స్ మ్యాచ్ లు మాత్రం కోల్కతా వేదికగా జరగనున్నాయి. ఇప్పుడు ఇదే సమస్య. ఎందుకంటే కోల్కతాలో గత రెండు, మూడు రాజులుగా భారీ వర్షాలు వస్తున్నాయి. దాంతో ఒక్కవేల మ్యాచ్ సమయంలో ఏం జరుగుతుంది అని అభిమానులు ఆలోచిస్తున్నారు. అయితే ఒకవేళ అలా మ్యాచ్ సమయంలో వర్షం పడితే.. రెండు గంటలు ఎదురు చూస్తారు. అప్పుడు మ్యాచ్ ప్రారంభమైతే 20 ఓవర్ల మ్యాచ్ సాగుతుంది. కానీ రెండు గంటల తర్వాత కూడా సాధ్యం కాకపోతే 5 ఓవర్ల మ్యాచ్ జరుగుతుంది. ఈ 5 ఓవర్ల మ్యాచ్ కోసం మరో రెండు గంటలు చూస్తారు.

Advertisement

అప్పటికి కూడా వర్షం అనేది తగ్గకపోతే సూపర్ ఓవర్ తో విజేతను నిర్ణయిస్తారు. అయితే ఈ మ్యాచ్ రాత్రి 12.50 గంటలలోపు ప్రారంభం కావాలి. అలా సాధ్యం కానీ నేపధ్యంలో మ్యాచ్ ఆడే రెండు జట్లలో ఏ జట్టు లీగ్ దశలో పాయింట్ల పట్టికలో మెరుగా ఉంటుందో ఆ జట్టును విజేతగా ప్రకటిస్తారు. అంటే ఒకవేళ ఈరోజు జరుగుతున్న క్వాలిఫైర్ 1 కు వరుణుడు గనుక అడ్డుపడితే… గుజరాత్ జట్టు లీగ్ దశలోని పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉంది గనుక.. ఆ జట్టును విజేతగా ప్రకటిస్తారు. రాజస్థాన్ జట్టు క్వాలిఫైర్ 2 కి వస్తుంది. అయితే ఈ రూల్స్ ను ఇప్పటికే ప్లాప్స్ కు వచ్చిన నాకుడు జట్లకు బీసీసీఐ చెప్పేసింది.

ఇవి కూడా చదవండి :

ధోనీ మ్యాచ్ గెలవగానే వికెట్ ని చేతిలో ఎందుకు పట్టుకుంటారో తెలుసా..!!

ఉమ్రాన్ జాతీయ జట్టుకు ఎంపిక కావడం పై తండ్రి ఎమోషల్..!

Visitors Are Also Reading