ఒకప్పుడు హీరోయిన్ గా టాలీవుడ్ లో వెలుగు వెలిగిన హీరోయిన్లలో లయ కూడా ఒకరు. తెలుగమ్మాయి అయిన లయ.. భద్రం కొడుకో సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు. కాగా లయ స్వయంవరం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఆ తర్వాత లయ అందం, అభినయానికి చాలామంది ఫ్యాన్స్ అయ్యారు. స్వయంవరం సినిమా తర్వాత లయకు టాలీవుడ్ లో చాలా ఆఫర్లు వచ్చాయి. ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే ఈమె అమెరికాకు చెందిన ఒక డాక్టర్ ని వివాహం చేసుకొని అమెరికాలో స్థిరపడ్డారు.
READ ALSO : TV9 దేవీ నాగవల్లిపై మరోసారి రెచ్చిపోయిన విశ్వక్ సేన్!
Advertisement
ఇలా 2006వ సంవత్సరంలో వివాహం చేసుకొని అమెరికా వెళ్లినటువంటి లయ అక్కడ ఉద్యోగం చేస్తూ భారీగా డబ్బు సంపాదించేవారని తెలుస్తోంది. ఇలా అమెరికాలో స్థిరపడిన లయ చాలా కాలం తర్వాత ఇండియాకు తిరిగివచ్చారు. అయితే ఈమె ఇండియాకు రావడంతో పలు ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె అమెరికాలో తను ఏం చేస్తుండే వారో తెలియజేశారు. 2011 నుంచి ఈమె ఐటీ సెక్టార్ ఉద్యోగం చేసేవారని తెలియజేశారు.
Advertisement
READ ALSO : Nidhhi Agerwal – Venu Swamy: నిధి అగర్వాల్ ఇంట్లో వేణు స్వామి పూజలు.. ఇదిగో వీడియో!
అయితే ఇండియాకు చెందిన కంపెనీకి తను ఉద్యోగం చేసే దానినని వెల్లడించారు. ఆ సమయంలో తనకు టాక్స్ లన్ని పోను నెలకు 12,000 డాలర్లు జీతం వచ్చేదని తెలిపారు. ఇక ఇండియన్ కరెన్సీ ప్రకారం ఈమె నెలకు ఏకంగా 960,000 జీతం అందుకునేవారని ఈ సందర్భంగా లయ తెలియజేశారు. ఇక తాను 2017 లో ఈ జాబ్ వదిలేసానని అనంతరం డ్యాన్స్ స్కూల్ ప్రారంభించామని తెలిపారు. అయితే కోవిడ్ కారణంగా అతని డ్యాన్స్ స్కూల్ కూడా మూత పడిందని లయ తెలియజేశారు.
READ ALSO : “బలగం” సినిమాలో ప్రియదర్శి పాత్రను వదులుకున్న స్టార్ కమెడియన్!