తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి డాన్స్ మాస్టర్ లలో టాప్ డాన్స్ మాస్టర్ గా ఉన్నారు శేఖర్ మాస్టర్. ఓవైపు డాన్స్ మాస్టర్ గా చేస్తూనే మరోవైపు బుల్లితెర రియాలిటీ డాన్స్ షో లలో జడ్జ్ గా పని చేస్తుంటారు. అలాంటి శేఖర్ మాస్టర్ స్టెప్పు వేశారు అంటే దానికి తిరుగు ఉండదు. అంతటి ఆయన సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కానీ కుటుంబానికి మాత్రం ప్రత్యేకంగా టైం కేటాయిస్తారు. అయితే ఆయన ఈమధ్య జరిగిన ఢీ షో లో మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. తండ్రి విలువ తెలియాలంటే కొడుకై పుడితే సరిపోదు ఆ కొడుకు తండ్రి స్థానంలోకి వస్తే తెలుస్తుంది అని అని అన్నారు.
also read:మెగా ఫ్యామిలిలో కల్లోలం.. ప్రియుడి ఫోటోలను షేర్ చేసిన నిహారిక ?
Advertisement
ప్రస్తుతం ఆయన మాట్లాడిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఢీ షోలో కొంతమంది కంటెస్టెంట్లు మన్నించయ్యా తప్పు మన్నించయ్యా సాంగ్ కు డాన్స్ వేశారు. ఆ డ్యాన్స్ పర్ఫామెన్స్ చూసిన శేఖర్ మాస్టర్ కన్నీళ్లు పెట్టుకుంటూ అందరు కొడుకులకు చెబుతున్నా తండ్రి ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా చూసుకోండి మిస్ యు నాన్న అంటూ కామెంట్ చేశారు. ఇప్పటికీ ఆయన మాట్లాడిన మాటలకు 12 లక్షల వ్యూస్ వచ్చాయి. ఇదంతా పక్కన పెడితే శేఖర్ మాస్టర్ ఇండస్ట్రీలోనే టాప్ కొరియోగ్రాఫర్ గా ఉన్నారు.
Advertisement
also read:అప్పుడు ఆశు రెడ్డి… ఇప్పుడు సురేఖ వాణి…వర్మ చేతిలో పడితే అంతే…!
ఆయనకు ఎంత పేరు ఉందో ఆయన పారితోషకం కూడా ఆ విధంగానే ఉంటుందట. ఇంతకీ ఆయన ఒక్క పాటకి ఎంత పారితోషకం తీసుకుంటారయ్యా అంటే 5 లక్షల రూపాయల రేంజిలో ఉంటుందట. ఇండస్ట్రీలో చాలామంది హీరోలు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీకి ఫిదా అవుతుంటారు. ప్రతి సినిమాలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఉండాలని కోరుకుంటారు. కేవలం తెలుగు ఇండస్ట్రినే కాకుండా ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా ఆయనకు ఆఫర్లు రావడం గమనార్హం. ఈ విధంగా శేఖర్ మాస్టర్ బాగానే సంపాదించారు.
also read:Sreeleela : 10 సినిమాలతో టాలీవుడ్ ను షేక్ చేస్తున్న శ్రీలీలా!