భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత జనవరి 26, 1950న సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది. భారత రాజ్యాంగం జనవరి 26, 1950న అమలులోకి వచ్చింది. ఇక అప్పటి నుంచే ప్రతీ సంవత్సరం జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీతో సహా దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. దేశంలో రిపబ్లక్ డే వేడుకలను జనవరి 26న కాకుండా కొంత మంది తిథుల ప్రకారం కూడా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ సంవత్సరం రిపబ్లిక్ డే వేడుకలను ఓ ప్రాంతంలో జనవరి 29న జరుపుకోనున్నారు. ఇలా జరుపుకోవడం వెనుక కూడా ఓ ప్రత్యేక కారణం ఉందంట. అది ఏ ప్రాంతం.. అక్కడ ఇలా ఎందుకు జరుపుకుంటారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉజ్జయినిలోని గణేషుని ఆలయంలో ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలను జనవరి 29న జరుపుకోనున్నారు. ఈ దేవాలయంలో రిపబ్లిక్ డే వేడుకలను ప్రతీ ఏడాది పలు తేదీలలో నిర్వహిస్తారు. ఇందుకు ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఆలయంలో జరుపుకునే వేడుకలను హిందూ క్యాలెండర్ ప్రకారం జరుపుకునే సంప్రదాయం ఉంది. ఈ సంప్రదాయాన్ని ఏళ్ల తరబడి అనుసరిస్తూ.. జాతీయ పండుగలను హిందూ క్యాలెండర్ ప్రకారం జరుపుకుంటారు. తీజ్, హిందూ పండుగలు, వార్షికోత్సవాలను ఇంగ్లీషు తేదీల ప్రకారం.. జరుపుకునే సంప్రదాయం హిందూ గ్రంథాలలో లేదని పంచాంగం ప్రకారం జరుపుకోవాలని ఆలయ పూజారులు పేర్కొంటున్నారు. ఏళ్ల తరబడి ఆలయంలో ఇదే జరుగుతుంది. భారతదేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26, 1950న మాఘమాసం శుక్ల పక్ష అష్టమి తిథి. కాబట్టి పంచాంగం ప్రకారం.. మాఘమాసంలో ఈ తిథి ఎప్పుడు వస్తే అదే రోజును రిపబ్లిక్ డే గా జరుపుకుంటారు.
Advertisement
Also Read : ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే 20 చిత్రాలు ఇవే..!
ఈ ఏడాది ఈ తిథి జనవరి 29న వచ్చింది. గణేష్ ఆలయంలో గణతంత్ర దినోత్సవాన్ని వైభవంగా జరుపుకుంటారు. దేశం ఆనందం, శ్రేయస్సుని కాంక్షిస్తూ.. విఘ్నాలకు అధిపతి గణేష్ కి పూజలను చేస్తారు. ఈరోజు ఆలయ శిఖరంపై కొత్త జెండాను ఎగురవేస్తామని.. స్వాతంత్య్ర సమరయోధులను కూడా స్మరించుకుంటాం అని చెప్పారు. ఉజ్జయిని గణేష్ దేవాలయం 1908లో స్థాపించబడింది. ఆ రోజు మాఘ కృష్ణ పక్షంలో చతుర్థి తిథి. పండిట్ బాలగంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవాలను ప్రచారం నుంచి ప్రేరణ పొందిన పండిట్ నారాయణ్ వ్యాస్ ఈ ఆలయానికి పునాది వేసారు.అప్పట్లో ఈ దేవాలయం స్వాతంత్ర సమర యోధుల ఆశ్రయంగా ఉన్నట్టు తెలుస్తోంది. దేశ స్వాతంత్య్రం కోసం ఈ ఆలయంలో అఖండ యాగాన్ని కూడా నిర్వహించారట.