Telugu News » Blog » టాలీవుడ్ లో 100 కోట్ల షేర్ ను వ‌సూళు చేసిన 7 హీరోలు వీళ్లే..!

టాలీవుడ్ లో 100 కోట్ల షేర్ ను వ‌సూళు చేసిన 7 హీరోలు వీళ్లే..!

by AJAY
Ads

కొన్ని సినిమాలకు హిట్ టాక్ వ‌చ్చినా కూడా క‌లెక్ష‌న్ లు పెద్ద‌గా రావు. అలాంటి సినిమాల‌తో నిర్మాత‌ల‌కు పెద్ద‌గా లాభాలు ఉండ‌వు. కోట్లు ఖ‌ర్చు పెట్టి సినిమాలు తీసేది డ‌బ్బుల‌కోస‌మే కాబ‌ట్టి లాభాలు వ‌చ్చిన‌ప్పుడు మ‌ళ్లీ సినిమాలు చేయ‌గ‌లుగుతారు. ఇక టాలీవుడ్ లో కొంత‌మంది స్టార్ లు ఏకంగా వంద కోట్ల క‌లెక్ష‌న్ ల‌ను రాబ‌ట్టి రికార్డులు క్రియేట్ చేశారు. ఆ రేంజ్ క‌లెక్ష‌న్ లు రాబ‌ట్టిన హీరోలు కొంత‌మందే ఉన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ టాలీవుడ్ లో మొత్తం 14 సినిమాలు వంద కోట్ల క‌లెక్ష‌న్ ల‌ను రాబ‌ట్టాయి. రీసెంట్ గా చిరంజీవి హీరోగా న‌టించిన వాల్తేరు వీర‌య్య సినిమా 100 కోట్ల‌ను వ‌సూళు చేసింది. ఆ క్ల‌బ్ లో చేరిన ప‌ద్నాలుగ‌వ సినిమాగా నిలిచింది. ఇక ఇప్పుడు తెలుగులో వంద‌కోట్ల‌ను వ‌సూళు చేసిన హీరోలు ఎవ‌రో చూద్దాం…

Advertisement

 

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ఈ లిస్ట్ లో నంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉన్నారు. మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన 4 సినిమాలు వంద కోట్ల క్ల‌బ్ లో ఉన్నాయి.

ఆ త‌ర‌వాత రెండో స్థానంలో ప్ర‌భాస్ ఉన్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన 3 సినిమాలు వంద కోట్ల‌కు పైగా వసూళ్ల‌ను రాబ‌ట్టాయి.

Advertisement

ఇక సీనియ‌ర్ హీరోల‌లో మెగాస్టార్ చిరంజీవి ఒక్క‌డికే ఆ క్రెడిట్ ద‌క్కింది. వాల్తేరు వీర‌య్య‌తో క‌లిపి చిరు న‌టించిన మూడు సినిమాలు వంద కోట్ల‌ను రాబ‌ట్టాయి.

అంతే కాకుండా అల్లు అర్జున్ హీరోగా న‌టించిన రెండు సినిమాలు వంద కోట్ల క్ల‌బ్ లో ఉన్నాయి.

మ‌రో మెగాహీరో రామ్ చ‌ర‌ణ్ న‌టించిన రెండు సినిమాలు కూడా వంద‌కోట్ల‌కు పైగా షేర్ ను రాబ‌ట్టాయి.

ఇక జూనియర్ ఎన్టీఆర్ న‌టించిన ఒకే సినిమా వంద కోట్ల షేర్ ను వ‌సూళు చేసిన క్ల‌బ్ లో చేరింది.

Advertisement

AlSO READ :వీరసింహా రెడ్డి లో నటించిన వరలక్ష్మి కి ఎన్ని కోట్లు ఇచ్చారో తెలుసా ? హీరో కంటే ఎక్కువా..?