Home » సీఎం జగన్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏంటి ? కేంద్రం సంకేతాలు ఇచ్చిందా ?

సీఎం జగన్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యల వెనుక అంతరార్థం ఏంటి ? కేంద్రం సంకేతాలు ఇచ్చిందా ?

by Anji
Ad

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తరువాత ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా మారిపోయాయి. చంద్రబాబు అరెస్ట్ తో టీడీపీకి ప్రజల్లో సానుభూతి పెరిగిందనే చర్చ కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్ట్ కారణంగా తమకు రాజకీయంగా లాభం జరుగుతుందని.. ఎలా నష్టం జరగదని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ విషయంలో జరుగుతున్న ప్రచారమంతా టీడీపీ సృష్టిస్తుందే అని.. ప్రజల్లో వాస్తవానికి అలాంటి పరిస్థితి లేదన్నది వైసీపీ భావన. తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి తమను గెలిపిస్తున్నాయని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. 

jagan

Advertisement

 

ముఖ్యంగా రాష్ట్రంలో ఎన్నికలు ముందస్తు జరుగుతాయా ? షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా అనే దానిపై చాలా కాలం నుంచి చర్చ జరుగుతుంది. మంత్రి వర్గ సమావేశంలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశముందనే కొత్త చర్చకు తెరలేపాయి. ఎన్నికలు ఎప్పుడూ జరిగినా సిద్ధంగా ఉండాలని మంత్రులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. కేంద్రం జమిలీ ఎన్నికల దిశగా ఆలోచన చేపడుతున్న నేపథ్యంలో అక్కడి నిర్ణయాలకు అనుగుణంగా ఏపీలో ఎన్నికలపై సంకేతాలు ఇచ్చారు సీఎం జగన్.కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లినట్టయితే అందుకు తగినట్టుగానే రాష్ట్రంలో కూడా ఎన్నికలు వస్తాయని సీఎం జగన్ మంత్రులకు సూచించారు. 

Advertisement

 

 

ఎన్నికల విషయంలో సీఎం జగన్ ఎప్పటికప్పుడు మంత్రులకు సూచనలు చేయాల్సిన అవసరముందనే దానిపై ఆసక్తి నెలకొంది. వాటితో పాటు గానే ఏపీలోనూ ఎన్నికలు జరుగుతాయనే ఆలోచనకు సీఎం జగన్ వచ్చారని.. అందుకే మంత్రులకు ఈ రకమైన ఆదేశాలు ఇచ్చారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలపై మంత్రులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సీఎం జగన్ ఈ రకమైన వ్యాఖ్యలు చేసి ఉంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తానికి ఏపీ కేబినెట్ భేటీ ప్రధానంగా ఎన్నికలపై సీఎం జగన్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాలో చర్చనీయాంశంగా మారాయి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి మంచు లక్ష్మికి పిలుపు..MP గా పోటీ చేస్తారా ?

పవన్ కళ్యాణ్ కోసం నాగార్జున చేసిన త్యాగం ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading