Home » ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి మంచు లక్ష్మికి పిలుపు..MP గా పోటీ చేస్తారా ?

ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి మంచు లక్ష్మికి పిలుపు..MP గా పోటీ చేస్తారా ?

by Bunty
Ad

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు వారి కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మంచు మోహన్ బాబు వారసత్వాన్ని అందిపుచ్చుకొని… ఆయన ఇద్దరు కుమారులు అలాగే కూతురు ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. మంచు వారి కుటుంబం ఏది చేసినా సంచలనంగా మారుతుంది. అలాగే ఈ మంచు కుటుంబానికి చెందిన సెలబ్రిటీలు ఎప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ… సోషల్ మీడియాలో వింత పోస్టులు పెడుతూ నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

Manchu Lakshmi Receives Invitation from PMO

Manchu Lakshmi Receives Invitation from PMO

ముఖ్యంగా మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ… నిత్యం ఏదో ఒక వార్తపై స్పందిస్తూ ఉంటుంది. అలాగే యూట్యూబ్ లో వీడియోలు పెడుతూ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మంచు లక్ష్మి. అయితే తాజా సమాచారం మేరకు మంచు లక్ష్మికి అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement

Manchu Lakshmi Receives Invitation from PMO

మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మికి ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం నుంచి పిలుపు వచ్చిందట. మంచు మోహన్ బాబుకు బిజెపి పెద్దలతో మంచి సాన్నిహిత్యం ఉంది. అప్పట్లో నరేంద్ర మోడీని కూడా మంచు కుటుంబం కలిసింది. ఇక లేటెస్ట్ గా ప్రధాని నరేంద్ర మోడీ కార్యాలయం నుంచి మంచు లక్ష్మికి పిలుపు వచ్చింది. దీంతో త్వరలోనే టాలీవుడ్ నటి మంచు లక్ష్మి బిజెపి తీర్థం పుచ్చుకోనున్నారని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి ప్రధాని కార్యాలయం నుంచి పిలుపు వెనక అసలు అర్థం ఏంటో త్వరలోనే క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading