Home » పవన్ కళ్యాణ్ కోసం నాగార్జున చేసిన త్యాగం ఏంటో తెలుసా ?

పవన్ కళ్యాణ్ కోసం నాగార్జున చేసిన త్యాగం ఏంటో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు.  అక్కినేని నాగార్జున కి మెగా ఫ్యామిలీ తో ఎంత మంచి సాన్నిహిత్యం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.  చిరంజీవి, నాగార్జున ఇద్దరు అన్నదమ్ముల మాదిరిగా కలిసి మెలిసి ఉంటారు.  ఆయనతో సరిసమానమైన స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ కూడా నాగార్జున పబ్లిక్ స్టేజి మీద అన్నయ్య అని పిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అదేవిధంగా చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ని కూడా నాగార్జున తన సొంత కొడుకులాగానే భావిస్తాడు.

Advertisement

నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో కి ఒక రోజు రామ్ చరణ్ వచ్చినప్పుడు మా అన్నయ్య కొడుకు, సంస్కారానికి పెట్టింది పేరు లాంటోడు అని ఎంతో గొప్పగా మాట్లాడాడు నాగార్జున. ఈ వీడియో ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. అయితే చిరంజీవి కుటుంబం లో నాగార్జున కి అందరితో మంచి సాన్నిహిత్యం ఉంది.  కానీ పవన్ కళ్యాణ్ ని మాత్రం పెద్దగా కలిసింది లేదు. కానీ సందర్భం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఎంతో గొప్పగా మాట్లాడాడు నాగార్జున. ఒకానొక సందర్భం లో పవన్ కళ్యాణ్ కోసం నాగార్జున తన తమ్ముడిని కూడా వదిలేసుకున్నాడట. తమ్ముడు అంటే నిజంగా తమ్ముడు అనుకునేరు.

Advertisement

తమ్ముడు కాదండోయ్.. తమ్ముడు సినిమాకి సబంధించిన టైటిల్.  నాగార్జున అప్పట్లో తానూ నటించబోయే కొత్త సినిమాకి ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించిన టైటిల్. ఆ టైటిల్ ని నాగార్జున తన సొంత నిర్మాణ సంస్థ అయినా అన్నపూర్ణ స్టూడియోస్ లో చేయబోతున్న సినిమా కోసం రిజిస్టర్ చేయించాడు. అయితే పవన్ కళ్యాణ్ కొత్త సినిమాకి కూడా డైరెక్టర్ అరుణ్ కుమార్ అదే టైటిల్ ని పెట్టాలని అనుకున్నాడు. అప్పటికే నాగార్జున ఈ టైటిల్ ని రిజిస్టర్ చేయించి ఉన్నారని పవన్ కళ్యాణ్ కి చెప్పగా.. ఆయన వెంటనే నాగార్జున గారికి కాల్ చేసి మేము చేస్తున్న సినిమాకి ఈ టైటిల్ చాలా యాప్ట్ అండీ. దయచేసి మాకు వదిలేయగలరా అని అడగగా వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా ఇచ్చేశాడట నాగార్జున. అలా పవన్ కళ్యాణ్ తో పెద్దగా పరిచయం లేకపోయినప్పటికీ కూడా అడగగానే ఇచ్చేశాడంటే నాగార్జున కి ఎంత మంచి మనసు ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

అక్కినేని మూడో తరం హీరోలు సక్సెస్ సాధించలేరా ? కారణం అదేనా ?

విజయ్ ఆంటోని కూతురు గురించి సంచలన విషయాలు చెప్పిన టీచర్లు.. ఆ సమస్యతోనే అంటూ..?

Visitors Are Also Reading