కరోనా మహమ్మారి తరువాత అలాంటి లక్షణాలతోనే H3N2 వైరస్. క్రమ క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఈ సమయంలో చాలా మంది భయాందోళన ప్రారంభమవుతుంది. వారి లక్షణాలను బట్టి అది కరోనా.. లేక H3N2 ఇన్ ప్లూఎంజానా లేక స్వైన్ ప్లూ నా అనేది నిర్దారించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. H3N2 అనేది సీజనల్ ఇన్ ఫ్లూఎంజాఫ్లూ. ఇది అంటువ్యాదిగా పరిగణించబడుతుంది. ప్రజల్లో దీర్ఘకాలిక అనారోగ్యానికి కారణమవుతుంది. దీనికి సంబంధించిన లక్షణాలు,తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర విషయాలను తెలుసుకుందాం.
Also Read : వేసవిలో బరువు తగ్గాలనుకుంటే ఈ జ్యూస్ తప్పక తాగండి..!
Advertisement
H3N2 ఇన్ ఫ్లూఎంజా వల్ల కలిగే లక్షణాలు వ్యక్తి నుంచి వ్యక్తికి మారవచ్చు. అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, శరీర నొప్పి, గొంతు నొప్పి, తీవ్రమైన నిరంతర దగ్గు, జలుబు, ఊపిరితిత్తులలో ఇబ్బంది వంటి లక్షణాలున్నాయి. కొందరిలో ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు లేదా అతిసారం ఉంటున్నాయని నిపుణులు చెబుతున్నారు. 3 నుంచి 5 రోజుల పాటు ఉండే జ్వరం మూడు వారాల వరకు సుదీర్ఘమైన దగ్గు జలుబుకు కారణం అవుతుందని వివరిస్తున్నారు. ఊపిరి పీల్చుకోవడం కష్టంగా అనిపించినా.. బీపీ డౌన్ అయినా, అధిక శ్వాస తీసుకోవడం, నీలిరంగు పెదవులు, మూర్చలు, గందరగోళం ఉంటే.. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి.
Advertisement
Also Read : గుండె బరువెక్కింది…గుబులు మొదలయ్యింది అంటూ సింగర్ సునిత ఎమోషనల్ పోస్ట్..!
ఐదేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు 65 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సున్న వృద్ధులు, గర్భిణులు, ఆస్తమా, మధుమేహం, గుండెజబ్బులు, బలహీనమైన నిరోధక వ్యవస్థ ఉన్న వారు నరాల వ్యాధులకు చికిత్స తీసుకుంటున్న వారు దీనికి గురయ్యే అవకాశం ఉంది. ఇన్ ప్లూఎంజాA H3N2 ఇన్ఫెక్షన్ అనేది A H1N1 లేదా B కంటే చాలా తీవ్రంగా ఉంటుంది. జ్వరం, తలనొప్పి సాధారణ అనారోగ్యం, గొంతునొప్పి వంటి ఇతర లక్షణాలు ఇన్ ప్లూఎంజా A H3N2, A H1N1 B ఇన్ఫెక్షన్లలో సమానంగా తరుచుగా కనిపిస్తాయి. H3N2, H1N1 వైరస్ లను ప్రయోగశాల పరీక్షల ద్వారా నిర్దారించవచ్చు. ఈ పరీక్ష విధానం కరోనాను పోలీ ఉంది. RTPCR ద్వారా నిర్దారించవచ్చు. ప్రజలు మాస్క్ లు ధరించాలని, చేతి పరిశుభ్రతను పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రాణాంతకమైన వ్యాధి కాకపోయినప్పటికీ జాగ్రత్తలు అవసరం అని నిపుణులు చెబుతున్నారు.
Also Read : రాత్రిపూట మీరు చపాతీలు తింటున్నారా ? అయితే మీరు ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..!