Home » వేసవిలో బరువు తగ్గాలనుకుంటే ఈ జ్యూస్ తప్పక తాగండి..!

వేసవిలో బరువు తగ్గాలనుకుంటే ఈ జ్యూస్ తప్పక తాగండి..!

by Anji
Ad

ఆధునిక జీవన శైలి కారణంగా వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా ఊబకాయం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. పలు అనారోగ్యకరమైన ఆహారాలు విచ్ఛలవిడిగా తినడం వల్ల ఒక్కసారిగా బరువు పెరుగుతున్నారు. పెరుగుతున్న బరువు కారణంగా చాలా మందిలో అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు వస్తున్నాయి. ఎంత సులభంగా బరువు తగ్గించుకుంటే అంత మంచిది అని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రాణాంతకంగా మారే అవకాశాలున్నాయి. వీలైనంత తొందరగా ఉపశమనం పొందడం చాలా మంచిది అని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. నిపుణుల ప్రకారం.. వేసవిలో పలు రకాల డ్రింక్స్ తాగడం వల్ల సులభంగా ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. ఎలాంటి డ్రింక్స్ తాగడం వల్ల సులభంగా బరువు తగ్గుతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Also Read :  నిద్రించే టైంలో గురక విపరీతంగా వస్తుందా? అయితే ఇవి తెలుసుకోండి!

Advertisement

ఆరేంజ్ వాటర్ :

manam News

Advertisement

ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఈ డ్రింక్ ని వేసవికాలంలో ఎక్కువగా తాగడం వల్ల సులభంగా శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ని తగ్గించుకోవచ్చు అనివైద్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాదు.. ఇందులో ఉండే గుణాలు ఎంతటి బరువును అయినా నియంత్రిస్తాయట. తాజాగా నారింజ పండ్ల నుంచి తీసిన రసాన్ని ప్రతిరోజూ తాగాల్సి ఉంటుంది. ఈ రసాన్ని తాగడం వల్ల శరీరం డీ హైడ్రేషన్ కి గురికాదు. వేసవికాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడే వారు తప్పకుండా నారింజ పండ్ల రసం తాగాలని సూచిస్తున్నారు నిపుణులు. 

దోసకాయ నీరు :

Manam News

చాలా మంది వేసవికాలంలో దోసకాయ తినడానికి ఇష్టపడుతారు. అంతేకాదు.. ఎండాకాలంలో దోసకాయలు మార్కెట్ లో ఎక్కువగా లభిస్తాయి. శరీరాన్ని డీ హైడ్రేట్ గా, రీఫ్రెష్ గా ఉంచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాదు.. దోసకాయను ప్రతిరోజూ తినడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. దీని కోసం మీరు దోసకాయను ఓ వాటర్ బాటిల్ నీరు పోసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్స్ చేసుకొని తాగితే శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాదు.. శరీరం డిటాక్స్ అవుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా వీటిలో ఉండే గుణాలు కొలెస్ట్రాల్ స్థాయిలను సులభంగా నియంత్రిస్తాయి. 

Also Read :  మీరు అతిగా నిద్ర పోతున్నారా.. అయితే ఈ ప్రమాదంలో పడినట్టే ?

Visitors Are Also Reading