Home » గోల్డెన్ వీసా అంటే ఏమిటి..మ‌న దేశంలో ఎవ‌రెవ‌రు తీసుకున్నారు..?

గోల్డెన్ వీసా అంటే ఏమిటి..మ‌న దేశంలో ఎవ‌రెవ‌రు తీసుకున్నారు..?

by AJAY
Published: Last Updated on
Ad

యూఏఈ ఏడు న‌గ‌ర రజ్యాల‌తో కూడిన ఓ ఫెడ‌రేష‌న్. ఇందులో దుబాయ్, అబుదాబీ, షార్జా, ర‌స‌ల్ ఖైమాతో పాటు మ‌రో మూడు ఎమిరేట్స్ ఉన్నాయి. అయితే యూఏఈ దీర్ఘ‌కాలిక నివాస వీసాలు ఇచ్చేందుకోసం 2019లో గోల్డెన్ వీసాలు ఇచ్చే ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఐదు నుండి ప‌దిసంవ‌త్సారాల పాటూ దీనిని జారీ చేస్తారు. ఈ వీసాలు నిబంధ‌న‌ల‌కు లోబ‌డి ఆటోమేటిక్ గా రెన్యువ‌ల్ అవుతుంటాయి. నేష‌న‌ల్ స్పాన్స‌ర్స్ అవ‌స‌రం లేకుండానే చ‌దువుకోవ‌డానికి…ఉద్యోగం చేయ‌డానికి నివ‌సించడానికి గోల్డెన్ వీసా వీలు క‌ల్పిస్తుంది. ఇక ప‌థ‌కాన్ని క‌ళాకారులు, డాక్ట‌ర్లు. ఇత‌ర రంగాల్లో నిపుణ‌ల కోసం ఈ ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చినట్టు ప్ర‌క‌టించింది.

అంతే కాకుండా వివిధ రంగాల్లో ప్ర‌తిభ చూపించిన వారు త‌మ దేశంలో ఉండ‌టం వ‌ల్ల దేశాభివృద్ధికి ఎంత‌గానో సహాయ‌ప‌డ‌తార‌ని యూఏఈ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఇక గోల్డెన్ వీసా పొందిన వారు కేవ‌లం సింగిల్ గా కాకుండా త‌మ కుటుంబంతో స‌హా క‌లిసి ఉండొచ్చు. అంతే కాకుండా గోల్డెన్ వీసా క‌లిగిన వాళ్లు త‌మ పేరెంట్స్ కు స్పాన్స‌ర్ లుగా ఉండొచ్చు. ఇదిలా ఉంటే ఒక‌వేళ సాధార‌ణ ప్ర‌జ‌లు మాత్రం గోల్డెన్ వీసాను పొందాలంటే క‌నీసం కోటి దేర‌మ్ లు అంటే ఇండియ‌న్ క‌రెన్సీ లెక్క‌న 20 కోట్లు పెట్టుబ‌డిగా పెట్టాలి. ఒక‌వేళ ఐదేళ్ల వీసా తీసుకోవాలంటే క‌నీసం 50ల‌క్ష‌ల దేర‌మ్ ల పెట్టుబ‌డి పెట్టాలి. అంతే కాకుండా అది రుణంగా తీసుకున్న సొమ్ము అయి ఉండ‌కూడ‌దు.

Advertisement

Advertisement

ఇక క‌ళాకారులు అయితే ఎమిరేట్స్ సాంస్కృతి విజ్ఞాన శాక‌ నుండి ఎక్రిడియేష‌న్ ను తీసుకుని ఉండాలి. ఇక ఇప్ప‌టి వ‌ర‌కూ యూఏఈ నుండి గోల్డెన్ వీసా అందుకున్న వారిలో భార‌తీయులు షారూఖ్ ఖాన్, అర్జున్ కపూర్, జాన్వీ కపూర్, నేహా కక్కర్, అమాల్ మల్లిక్, మోహన్‌లాల్, మమ్ముట్టి, దుల్కర్ సల్మాన్, ప్రముఖ సింగర్ కేఎస్ చిత్ర, ఫర్హాన్ ఖాన్, బోనీకపూర్ లు ఉన్నారు. ఇక తాజాగా టాలీవుడ్ ముద్దుగుమ్మ త్రిష కూడా యూఏఈ నుండి గోల్డెన్ వీసా అందుకుని త‌మిళ ఇండ‌స్ట్రీ నుండి మొద‌ట గోల్డెన్ వీసా అందుకున్న న‌టిగా రికార్డు సాధించింది.

ఇక తాజాగా టాలీవుడ్ ముద్దుగుమ్మ త్రిష కూడా యూఏఈ నుండి గోల్డెన్ వీసా అందుకుని త‌మిళ ఇండ‌స్ట్రీ నుండి మొద‌ట గోల్డెన్ వీసా అందుకున్న న‌టిగా రికార్డు సాధించింది.

Also Read:కోటి గెలిచిన  ఎస్సైకి వ‌చ్చేది మాత్రం అంతేన‌ట‌..!

Visitors Are Also Reading