ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షో లో రీసెంట్ గా కొత్తగూడెం టౌన్ కు చెందిన ఎస్ ఐ రాజా రవీంద్ర కోటి రూపాయలు గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు తెలుగు టీవీ ఇండస్ట్రీ లోనే మొదటి సారి కోటి రూపాయలు గెలుచుకున్న వ్యక్తిగా రాజారవీంద్ర చరిత్ర సృష్టించారు. ఈ షోలో ఎన్టీఆర్ అడిగిన 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పి రాజా రవీంద్ర ఈ ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. ఇక కోటి రూపాయలు గెలుచుకోవడంతో అంతా రాజా రవీంద్ర ఒక్క షో లో కోటి రూపాయలు ఇంటికి తీసుకువెళతాడని అనుకుంటున్నారు. నిజానికి ఆయన గెలుచుకుంది కోటి రూపాయలే కానీ ఆయనకు చేతికి వచ్చేది మాత్రం అంత కాదు అనే విషయం చాలా మందికి తెలియదు.
Advertisement
రవీంద్ర అనే కాదు ఏ టీవీ షోలో ఎవరు డబ్బులు గెలిచినా….. లేదంటే లక్కీ లాటరీలలో డబ్బులు గెలుచుకున్నా కూడా ఆ డబ్బులు పూర్తిగా తీసుకోలేరు. దానికి కారణం టీవీషోలు మరియు లాటరీల ద్వారా వచ్చిన డబ్బుకు ప్రభుత్వం ఎక్కువగా ట్యాక్స్ ను వసూలు చేస్తుంది. విజేతలకు ముందుగా ట్యాక్స్ ను కట్ చేసి ఆ సొమ్మును అందజేస్తారు. ఏదైనా షో లో గానీ లాటరీలో గానీ పదివేల కంటే ఎక్కువ డబ్బులు గెలుచుకుంటే టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇక కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ రూల్స్ ప్రకారంగా టీవీషోల ద్వారా గెలుచుకున్న డబ్బులో 31.2శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది.
Advertisement
ఆ లెక్కన చూసుకుంటే కోటి గెలుచుకున్న రవీంద్రకు కూడా వచ్చేది దాదాపు 68,80,000 మాత్రమే ఉంటుంది. కాబట్టి షో ద్వారా కోటి రూపాయలు గెలుచుకున్న రాజా రవీంద్ర 31,20,000 కట్టాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా రాజా రవీంద్ర బీటెక్ చదువుకుని ఆ తరవాత లా పూర్తి చేశారు. ఆ తరవాత పోలీస్ ఉద్యోగం సాధించి ఎస్సై గా విధులు నిర్వహిస్తున్నారు. ఇదివరకు ఆయన హైదరాబాద్ క్రైం బ్రాంచ్ లో సైతం విధులు నిర్వహించారు. అంతే కాకుండా రాజారవీంద్ర షూటింగ్ లోనూ రాణిస్తున్నారు. తాను ఎవరు మీలో కోటీశ్వరుడు షోలో గెలుచుకున్న డబ్బులతో ఒలంపిక్స్ కు వెళతానని కూడా చెప్పిన విషయం తెలిసిందే.