Home » భార్యా భర్తల మధ్య ఏజ్ గ్యాప్ మరీ ఎక్కువ ఉందా…? అయితే ఈ సమస్యలు తప్పవట..!

భార్యా భర్తల మధ్య ఏజ్ గ్యాప్ మరీ ఎక్కువ ఉందా…? అయితే ఈ సమస్యలు తప్పవట..!

by AJAY
Ad

తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం సంబంధాలు చూసేటప్పుడు ముందుగా ఉద్యోగం ఉందా ఆస్తులు ఉన్నాయా మరియు ఇతర అంశాలను పరిశీలిస్తారు. కానీ వయసును పెద్దగా పట్టించుకోరు అంటే పది నుండి 12 సంవత్సరాలు పెద్దవాడైనా లైట్ తీసుకుంటారు. అయితే ఐదేళ్ల వరకు ఏజ్ గ్యాప్ ఉంటే పెద్దగా సమస్య లేదు. కానీ పదేళ్లు ఏజ్ గ్యాప్ వ‌చ్చిందంటే భార్య భర్తల మధ్య అనేక సమస్యలు వస్తాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇద్దరి మధ్య గ్యాప్ ఉండడం వల్ల పిల్లలను కనే విషయంలో భిన్నాభిప్రాయాలు ఏర్పడతాయట. భార్య వయసు తక్కువగా ఉండటం వల్ల ఇప్పుడే పిల్లలు ఎందుకు కొన్ని రోజు స‌ర‌దాగా గ‌డుపుదాం అనే భావన ఆమెకు ఉంటుందట.

Also Read: ఒకే తరగతిలో..ఓకే క్లాసులో చదువుకున్న సెలబ్రిటీలు వీరే..!

Advertisement

Advertisement

కానీ భర్తకు వయసు ఎక్కువగా ఉండడం వల్ల వెంటనే పిల్లలు కనాలని ఆలోచిస్తున్నారట. అలాంటి సమయంలో ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడే అవకాశం ఉందట. ఇద్దరి మధ్య వయసు తేడా ఉండటంతో వారి ఇష్టాయిష్టాల కూడా వేరుగా ఉంటాయి. అలా ఉంటే భార్య భ‌ర్త కంటే అప్డేడ్ ఆలోచిస్తుంట అలా ఉన్నా భిన్నాభిప్రాయాలు వస్తాయట. ప్రేమకు వయసుతో సంబంధం లేదని చెబుతుంటారు కానీ అవి చెప్పుకోవడానికే బాగుంటాయి. నిజ జీవితంలో అంతా వేరుగా ఉంటుంది. చేసుకున్న భర్త ఒక స్థాయిలో ఆలోచిస్తే అతడి భార్య మాత్రం కాస్త అప్డేట్ గా ఆలోచిస్తే ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది దాంతో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంది.

husband and wife age gap

husband and wife age gap

ఇక ఈ సమస్యలతోబ‌పాటు వయోబేధం వల్ల లైంగిక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందట. ఎందుకంటే ఇద్దరి ఆలోచనలు కోరికలు వేరుగా ఉంటాయి. దాంతో ఇద్దరికీ ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక ఈ సమస్యలే కాక ఇద్దరికీ సామాజిక సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. భార్యా భ‌ర్త‌ల మధ్య వయసు వేదం ఎక్కువగా ఉంటే సామాజిక ఆమోదం పొందలేదు. అలా పెళ్లి చేసుకుంటే సామాజిక ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది.

Also Read: భర్తలు భార్యలను ఎందుకు కొడతారు…7కారణాలు ఇవేనట..!

Visitors Are Also Reading