ఒకే పాఠశాలలో ఒకే తరగతి లో కలిసి చదువుకున్న స్నేహితులు ఆ తరవాత ఓకే రంగంలో స్థిరపడితే వారి బాల్యానుభూతులను గుర్తు చేసుకుని మురిసిపోతుంటారు. మనం అప్పుడు అలా చేశాం..ఇప్పుడు ఇలా చేశాం అంటూ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటారు. అయితే పలువురు సెలబ్రిటీలు సైతం ఓకే తరగతి గదిలో చదువుకుని ఇప్పుడు ఓకే రంగంలో రానిస్తునరని మీకు తెలుసా…అలా రాణిస్తున్న వారిలో సినిమా తారలే కాదు. వ్యాపారవేత్త లు కూడా ఉన్నారు. వారు ఎవరో ఇప్పుడు చూద్దాం…
Advertisement
Ramcharan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు దగ్గుబాటి రానా ఒకే పాఠశాలలో ఒకే స్కూల్ లో కలిసి చదువుకున్నారు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో ఇద్దరూ షేర్ చేశారు. అంతేకాకుండా తనకు పంపిన టిఫిన్ బాక్స్ ను రానా కాళీ చేసేవాడని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.
Anushka Sharma skahsi
టీమిండియా రథసారథి విరాట్ కోహ్లీ భార్య… అదేవిధంగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సతీమణి సాక్షి ఇద్దరు కూడా అసోంలోని ఒక పాఠశాలలో ఒకే తరగతి లో కలిసి చదువుకున్నారు.
Advertisement
Nani pradeep
నాచురల్ స్టార్ నాని మరియు తెలుగులో టాప్ యాంకర్లలో ఒకరైన ప్రదీప్ మాచిరాజు కూడా ఒకే స్కూల్లో ఒకే తరగతిలో కలిసి చదువుకున్నారు. ప్రస్తుతం నాని హీరోగా రాణిస్తుండగా ప్రదీప్ బుల్లితెరపై సందడి చేస్తున్నారు.
Ameerkhan salman khan
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ లు కూడా ఒకే స్కూల్ లో ఒకే తరగతిలో కలిసి చదువుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు.
Mukesh ambani anand mahindra
వీరు మాత్రమే కాకుండా దిగ్గజ వ్యాపారవేత్తలు ముకేశ్ అంబానీ మరియు ఆనంద్ మహీంద్రా కూడా చిన్నతనంలో ఒకే పాఠశాలలో ఒకే క్లాసులో కలిసి చదువుకున్నారు. ప్రస్తుతం ఇద్దరూ వ్యాపార రంగంలో పోటీ పడుతున్నారు.
Also Read: సినిమాల కంటే ఓటీటీ లోనే ఎక్కువ సంపాదిస్తున్న స్టార్స్ వీరే..!