Home » తెలుగు సినిమాల్లో ఎంతో పేరు సంపాదించుకున్న ‘రావు గోపాల్ రావు’ చనిపోతే ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు చూడటానికి కూడా వెళ్ళలేదు..?

తెలుగు సినిమాల్లో ఎంతో పేరు సంపాదించుకున్న ‘రావు గోపాల్ రావు’ చనిపోతే ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు చూడటానికి కూడా వెళ్ళలేదు..?

by AJAY
Ad

ప్ర‌స్తుతం రావుర‌మేష్ విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లతో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రావు ర‌మేష్ ఎంత గొప్ప న‌టుడో ఆయ‌న తండ్రి రావు గోపాల‌రావు అంత‌కంటే గొప్ప న‌టుడిగా పేరు సంపాదించుకున్నారు. ఒక‌ప్పుడు తెలుగు విల‌న్ అంటే రావుగోపాల్ రావు పేరే వినిపించేది. రావుగోపాల్ రావు మొద‌ట రంగ‌స్థ‌ల న‌టుడిగా పేరు సంపాదించుకుని ఆ త‌ర‌వాత సినిమా పరిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టాడు. న‌ట‌న పై ఆసక్తితో ఇండ‌స్ట్రీలో చిన్న చిన్న పాత్ర‌లు చేశాడు.

Advertisement

ఇక క్రాంతికుమార్ నిర్మాణం వ‌చ్చిన శార‌ద సినిమాలో న‌టించి మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సినిమా త‌ర‌వాత బాబు తెర‌కెక్కించిన ముత్యాల ముగ్గు సినిమాలో అవ‌కాశాన్ని అందుకున్నాడు. ఈ సినిమా త‌ర‌వాత రావు గోపాల‌రావు వెనక్కి తిరిగి చూసుకోలేదు. వ‌రుస ఆఫ‌ర్ లతో ఇండ‌స్ట్రీలోనే ఫుల్ బిజీ న‌టుడిగా మారిపోయాడు. సినిమాల్లో రెమ్యున‌రేషన్ ఎక్కువ‌గానే పుచ్చుకున్న‌ప్ప‌టికీ ముందు చూపు లేని కార‌ణంగా ఆర్థికంగా ఎద‌గ‌లేక‌పోయారు.

Advertisement

అంతే కాకుండా అంద‌రినీ న‌మ్మి సంపాదించిన‌దంతా పోగొట్టుకున్నారు. ఓ వైపు ఆర్థిక క‌ష్టాలతో ఇబ్బంది ప‌డుతున్న స‌మ‌యంలోనే రావుగోపాల‌రావుకు అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌చ్చిప‌డ్డాయి. ఆ స‌మ‌యంలో వైద్యానికి సైతం డ‌బ్బులు లేక ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్నాడు. చికిత్స తీసుకుంటున్న స‌మ‌యంలోనే రావుగోపాల‌రావు 1994 ఆగ‌స్టు 13న క‌న్ను మూశారు. రావుగోపాల‌రావు చనిపోయిన నాటికి చిత్ర‌ప‌రిశ్ర‌మ మ‌ద్రాసులోనే ఉంది. దాంతో మ‌ద్రాసులోనే రావుగోపాల‌రావు అంత్య‌క్రియ‌ల‌ను నిర్వ‌హించారు.

అయిన‌ప్ప‌టికీ అతికొద్ది మాత్ర‌మే రావుగోపాలరావు అంత్య‌క్రియ‌లకు హాజరై నివాళ్లు అర్పించారు. అల్లు రామ‌లింగయ్య‌, రేలంగి, నిర్మాత జై కృష్ణ‌, పిఎల్ నారాయ‌ణ స‌హా మరికొంద‌రు అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌రైన‌ట్టు తెలుస్తోంది. అంత్య‌క్రియ‌లను రావుర‌మేష్ ఆయ‌న సోద‌రుడు క్రాంతి క‌లిసి నిర్వ‌హించార‌ట‌. ఆ స‌మ‌యంలో కొంద‌రు ఆపండి అంటూ త‌మిళంలో అన‌డంతో ఇంకా ఎవ‌రైనా వ‌చ్చేవాళ్లు ఉన్నారా అని ప్ర‌శ్నించార‌ట‌. దాంతో అల్లు రామ‌లింగ‌య్య ఎవ‌రూ లేరు అంటూ స‌మాధానం ఇచ్చారు. అలా ఇంస్ట్రీలో ఓ వెలుగు వెలిగినప్ప‌టికీ రావుగోపాల‌రావు అంత్య‌క్రియ‌లు మాత్రం అతికొద్దిమంది మ‌ధ్య‌లో మాత్ర‌మే జ‌ర‌గ‌టం బాధాక‌రం.

Visitors Are Also Reading