Telugu News » Blog » భార్య భర్తల మధ్య కండిషన్స్ ఉంటే జరిగే నష్టాలు అవేనా…?

భార్య భర్తల మధ్య కండిషన్స్ ఉంటే జరిగే నష్టాలు అవేనా…?

by AJAY
Published: Last Updated on
Ads

పెళ్లి త‌ర‌వాత జీవితం బాగుండాలి అంటే చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఏదైనా తేడా వ‌చ్చిందంటే అంతే సంగ‌తి. చిన్న చిన్న విష‌యాలే పెద్ద గొడ‌వ‌లుగా మారి ఆ త‌ర‌వాత విడిపోయే అవ‌కాశాలు కూడా ఉంటాయి. కాబ‌ట్టి ఏం చేయాలి ఎలాంటి నిర్నయాలు తీసుకోవాలి అన్న విష‌యంలో ఆచితూచి అడుగులు వేయాలి. ఇక ప్ర‌స్తుతం బిజీ లైఫ్ భార్య భ‌ర్త‌లు ఇద్ద‌రూ ఉద్యోగాలు చేస్తుండ‌టం వ‌ల్ల కొన్ని ఇబ్బందులు త‌లెత్తుతున్నాయి.

Also Read: వావ్.. ప్ర‌భాస్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్ కాంబినేష‌న్ ఎలా ఉంటుందో ఈ ట్రైల‌ర్‌తోనే తెలిసిపోయింది..!

ఇద్ద‌రూ బిజీ ఉండ‌టంతో ఒక‌రికి మ‌రొక‌రు కండిష‌న్స్ పెట్టుకుంటున్నారు. అయితే అలా కండిష‌న్స్ పెట్టుకోవ‌డం వ‌ల్ల మ‌రిన్ని స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని మాన‌సిక నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ టైమ్ నుండి ఈ టైమ్ వ‌ర‌కూ నేను ప‌నిలో బిజీగా ఉండాల‌ను కాబట్టి ఫ‌లానా స‌మ‌యంలోనే మనం మాట్లాడుకోవాలి అని కూడా కండిష‌న్స్ పెట్టుకునే జంటలు ఉన్నాయి. అలా మాట్లాడుకున్న త‌ర‌వాత ఎవ‌రి ఇష్టం వారిదే అంటూ ఒప్పందం కూడా చేసుకుంటున్నారు.

అయితే పెళ్లికి ముందు ప్రేమించే స‌మ‌యంలో మాత్రం ఇద్ద‌రి మ‌ధ్య‌న ఎలాంటి కండిష‌న్స్ ఉండ‌వు. అలాంటి స‌మ‌యంలోనే ఇద్ద‌రూ అన్ కండిష‌న‌ల్ గా ప్రేమించుకుంటార‌ట‌. ఎప్పుడైతే ఇద్ద‌రి మ‌ధ్య కండిష‌న్స్ ఉంటాయో అప్పుడు ప్రేమించుకోవ‌డం కూడా త‌గ్గిపోతుందని మాన‌సిక నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

Also Read: మేము నీతోనే ఉన్నాం…సాయిప‌ల్ల‌వికి అండ‌గా ప్ర‌కాష్ రాజ్..!

 కండిష‌న్స్ లేనప్పుడు ఇద్ద‌రి మ‌ధ్య న‌మ్మ‌కం ఉంటుంద‌ని లేదంటే న‌మ్మ‌కం కూడా ఉండ‌ద‌ని చెబుతున్నారు. ప్ర‌తి విష‌యాన్ని ఇద్ద‌రూ క‌లిసి షేర్ చేసుకోవాల‌ని చెబుతున్నారు. ఇద్ద‌రూ ఎలాంటి కండిష‌న్స్ లేకుండా మాట్లాడుకోవ‌డం ఉండటం వ‌ల్ల ఎలాంటి గొడ‌వ‌లు రావ‌ని చెబుతున్నారు. కండిష‌న్స్ లేకుండా క‌లిసి ఉన్న‌ప్పుడే ఇద్ద‌రి మ‌ధ్య‌న కొన్ని బాండింగ్ పెరుగుతుంద‌ని ఇద్ద‌రికీ మ‌ర్చిపోలేని మెమోరీస్ ఉంటాయ‌ని చెబుతున్నారు.

Also Read : తెలుగు యాంక‌ర్స్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారో తెలుసా..అందరికంటే ఎక్క‌వ ఎవ‌రికంటే..?


You may also like