ఇటీవల విజయవాడలో దివంగత నటుడు, ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి రజినీకాంత్ చీఫ్ గెస్ట్ విచ్చేశారు. సూపర్ స్టార్ గా వచ్చిన రజినీకాంత్.. చంద్రబాబుని పొగడ్తలతో ముంచెత్తారు. 2024 ఎన్నికల్లో బాబును ని గెలిపిస్తే దేశంలోనే ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉంటుందని చెప్పుకొచ్చారు. చంద్రబాబు వల్ల హైదరాబాద్ లో అభివృద్ి జరిగిందని వివరించారు. రజినీకాంత్ చేసిన కామెంట్స్ పై వైసీపీ నేతలు విమర్శలు చేశారు.
Advertisement
వైసీపీ నేతల విమర్శలపై సినీ నటుడు సమన్ తాజాగా స్పందించారు. ఏపీ సీఎం జగన్ గారిని విమర్శించినప్పుడు స్పందించిన విధంగా వైసీపీ నాయకులు రజినీకాంత్ ని విమర్శించడం సరైంది కాదన్నారు. రజినీకాంత్, చంద్రబాబు ఎప్పటి నుంచో స్నేహితులు అని.. రామారావు గారితో కూడా రజినీకి పరిచయముంది. ఏ ఒక్క పార్టీపై కానీ, వ్యక్తి గతంగా కానీ ఆరోజు రజినీకాంత్ ప్రసంగంలో విమర్శ చేయలేదని గుర్తు చేశారు. అలాంటి అప్పుడు వ్యక్తిగత దూషణలకు వైసీపీ నేతలు వెళ్లకూడదని చెప్పుకొచ్చారు నటుడు సుమన్.
Advertisement
Also Read : ఓటీటీలోకి తోడేలు మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ?
తాను రజినీకాంత్ తో దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి కలిసి పని చేశానని.. ఆయన కష్టపడి పైకి వచ్చారు. ఒక కండక్టర్ గా ఉన్న వ్యక్తి సూపర్ స్టార్ గా ఎదిగారంటే ఆయన ఎంత కష్టపడ్డారో అందరికీ తెలుసు అన్నారు. సినిమా ఏదైనా ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకూడదని తన సొంత డబ్బులు వెనక్కి ఇచ్చేసిన ఏకైక మొట్టమొదటి హీరో రజినీకాంత్ అని పేర్కొన్నారు. రజినీ ఎదుటివారిని విమర్శించే రకం కాదని.. రజినీతో తాను సినిమాలు చేశానని గుర్తు చేసుకున్నారు. అంతకు ముందు చేశాను. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన శివాజీ సినిమాలో ఆయనతో కలిసి పని చేయడం జరిగిందన్నారు. రజినీ మనస్సు ఎప్పుడూ ఒకే రకంగా ఉంది. అలాంటి వ్యక్తిని విమర్శించడం మంచిది కాదని చెప్పుకొచ్చారు సుమన్.