కొన్ని సార్లు పాటలు బాగా పాపులర్ అవుతాయి. ఎంతగా అంటే ఆ పాటకోసమే ఆ సినిమా చూడాలనే అంతగా పాపులర్ అవుతుంటాయి. ఏ పాట ఎప్పుడ ఫేమస్ అవుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ముఖ్యంగా కొన్ని పాటలు సినిమా విడుదలకు ముందే పాపులర్ అవుతాయి. మరికొన్ని సినిమా విడుదల తరువాత పాపులర్ అవుతుంటాయి.
Also Read : చాయ్ అధికంగా తాగుతున్నారా..? ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోండి
Advertisement
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించే సినిమాల విషయానికి వస్తే.. అతను ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నింటికి దాదాపుగా సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అవ్వడం విశేషం. స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి ఆర్ఆర్ఆర్ వరకు రాజమౌళి తెరకెక్కించిన సినిమాలన్నింటికి కీరవాణి సంగీతం అందించడంతో పాటు అన్ని సినిమాలలోని పాటలు హిట్ సాధించాయనే చెప్పాలి. అందులో ముఖ్యంగా మగధీర సినిమాలో దాదాపుగా అన్ని పాటలు హిట్.. ఓ వైపు పాటలు, మరొక సినిమా స్టోరీ ఇలా ఏ విధంగా చూసుకున్నా మగధీర సినిమాను రికార్డులకెక్కించాయి.
Advertisement
ముఖ్యంగా సినిమాలోని బంగారు కోడిపెట్ట పాటను మెగాస్టార్ చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సినిమాలోని పాటను రీమెక్ చేశారు. ఈ పాటను రికార్డు చేస్తున్నప్పుడు అప్ అప్ హ్యాండ్స్ అప్ అని ఏ సింగర్ కూడా అనలేకపోయారట. ఆ పవర్ ఎవరికీ కూడా అప్పుడు రాలేదట. ఇక సంగీత దర్శకుడు కీరణవాణి ఎస్పీ బాలు గారి పాడిన పాట వర్షన్‌కు సంబంధించిన బిట్ తీసి కట్ చేసి దాంట్లో వాడినట్టు వెల్లడించాడు. ఆ తరువాత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ వాయిస్ నా గొంతులాగా ఉందని అడిగారట. మీ వాయిస్ లాగా కాదు సార్.. మీదే ఇది అని ఎం.ఎం.కీరవాణి బాలు గారికి చెప్పారట.
Also Read : మధ్యలోనే ఆగిపోయిన రాజమౌళి సినిమా ఏదో తెలుసా…హీరో ఎవరంటే..!