Home » చాయ్ అధికంగా తాగుతున్నారా..? ఈ విష‌యాన్ని త‌ప్పకుండా తెలుసుకోండి

చాయ్ అధికంగా తాగుతున్నారా..? ఈ విష‌యాన్ని త‌ప్పకుండా తెలుసుకోండి

by Anji
Ad

ప్ర‌స్తుత రోజుల్లో చాయ్ అంటే ఇష్టం లేని వారుండ‌రు. మ‌నం పొద్దున లేవ‌గానే తొలుత తాగాల్సిందే. టీ తాగ‌కుంటే ఎవ‌రికీ ఏ ప‌ని తోచ‌దు. మ‌న‌కు త‌ల‌నొప్పి వ‌చ్చినా, ఏ స‌మ‌స్య వ‌చ్చినా మొద‌ట‌గా చాయ్ తాగుతాం. అయితే కొంత మంది రోజుకు ఒక్క‌సారి కాదు.. మూడు నుంచి నాలుగు సార్లు తాగుతుంటారు. చాయ్ అధికంగా తీసుకోవ‌డం వ‌ల్ల లావు అవుతుంటారు. అందుకు ప్ర‌ధాన కార‌ణం టీలో కేల‌రీలు చాలా అధికంగా ఉండ‌డ‌మే. ఈ విష‌యం తెలియ‌క చాలా మంది రోజుకు రెండు మూడు సార్లు తాగుతుంటారు. కొన్ని ముఖ్య‌మైన టిప్స్ పాటించ‌డంతో మీరు బ‌రువు పెర‌గ‌కుండా ఉండ‌వ‌చ్చు.

Also Read : ఐపీఎల్‌లో అత్యంత చెత్త బౌలింగ్ చేసిన టాప్ 5 బౌల‌ర్లు వీరే..!

Advertisement


చాలా మంది టీని పెట్టుకునేట‌ప్పుడు కొద్దిగా అల్లం లేదా ఇలాచి వాడుతుంటారు. వాస్త‌వానికి ఇలా చేయ‌డం వ‌ల్ల మెట‌బాలిజం పెరుగుతుంది. అలాగే అనారోగ్యానికి కూడా ఇది బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. క‌నుక టీని పెట్టుకునే ట‌ప్పుడు కొంచెం తుల‌సి కానీ, యాల‌కులు కానీ, ల‌వంగాల‌ను కానీ వేసుకొండి. ఇలా చేయ‌డం వ‌ల్ల దానిలో పోష‌క ప‌దార్థాలు పెరుగుతాయి. ఇదేవిధంగా మెట‌బాలీజంకు ఉప‌యోగ‌ప‌డుతుంది. బ‌రువును అదుపులో ఉంచ‌డానికి కూడా ఇది స‌హాయ ప‌డుతుంది. ముఖ్యంగా ల‌వంగాలు కొవ్వును క‌రిగించ‌డానికి స‌హాయ‌ప‌డుతాయి. బాగా లావు అయిపోతున్నామ‌నుకునే వాళ్లు క్యాల‌రీల‌ను త‌గ్గించుకోవ‌డానికి ఫ్యాట్ మిల్క్ కాకుండా చూసుకోండి.

Advertisement

ఎక్కువ కొవ్వును ఉండే పాల‌ను ఉప‌యోగించ‌డం వ‌ల్ల లావు అవుతుంటారు. మీరు కావాలంటే ఓట్స్ మిల్క్‌, ఆల్మండ్ మిల్క్‌, లేదా సోయా మిల్క్ వాడ‌వ‌చ్చు. అదేవిధంగా క్రిమ్ ఉండే పాల‌కు దూరంగా ఉండ‌డం మంచిది. ఇలా చేయ‌డం వ‌ల్ల కూడా కేల‌రీలు త‌గ్గుతాయి. పైగా బ‌రువు పెరిగిపోకుండా ఉండ‌డానికి కూడా అవుతుంది. చాయ్ మాన‌లేక‌పోతున్నారా అయితే దానిలో ఉండే శాతాన్ని త‌గ్గించండి. చ‌క్క‌ర‌ను పూర్తిగా త‌గ్గించ‌డం మంచిదే. కొద్దిగా చ‌క్క‌ర త‌గ్గిస్తే కేల‌రీలు త‌గ్గుతాయి. కావాల‌నుకుంటే మీరు త‌గ్గించి అందులో బెల్లం కానీ, తేనే కానీ వేసుకోండి. ఇలా చేయ‌డం వ‌ల్ల తియ్య‌ద‌నం వ‌స్తుంది. అలాగే చ‌క్క‌ర వ‌ల్ల క‌లిగే న‌ష్టాల‌కు దూరంగా ఉండ‌వ‌చ్చు.

Also Read :  తెలుగులో టాప్ 5 ఆర్ట్ డైరెక్ట‌ర్స్ వారి సెట్టింగ్స్!

Visitors Are Also Reading