సాధారణంగా వ్యక్తిగల లోన్లు మంజూరు చేసేటప్పుడు ఆ వ్యక్తి సిబిల్ స్కోర్ లేదా ఆధార్ లాంటి వివరాలను తీసుకొని ఇస్తుంటారు. తెలిసిన వ్యక్తులు లేదా ఆ రుణం చెల్లించేందుకు హామీ ఇచ్చిన వ్యక్తుల వివరాలను తీసుకుంటారు. బ్యాంకు నుంచి అప్పు తీసుకున్న వ్యక్తి ఆ రుణాన్ని చెల్లించని పక్షంలో బ్యాంకు వినియోగదారులకు నోటీసులు పంపిస్తుంది. ఇక నిబంధనలను అనుసరించి నోటీసులను పంపిన తరువాత రుణ గ్రహీత స్పందించని పక్షంలో బ్యాంకు రుణాన్ని వసూలు చేసే బాధ్యతను లోన్ రీకవరీ ఏజెంట్లకు లేదా సంస్థకు అప్పగిస్తుంది. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఆమోదం లేకుండా రుణాలను మంజూరు చేసే యాప్స్ పై ఎవరి పర్యవేక్షణ ఉండదు. ఈ లోన్ యాప్స్ నిర్వాహకులు వినియోగదారుల ఫోన్ యాక్సెస్ తీసుకుంటారు. రుణాన్ని చెల్లించనప్పుడు కాంటాక్ట్స్ అందరికీ సమాచారం ఇవ్వడం లాంటి చవకబారు పనులకు పాల్పడుతున్న వార్తలను తరచూ వింటుంటాం.
వినియోగదారుల ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా.. వారిని మానసిక వేదనకు గురిచేస్తోందని ఓ నిపుణుడు పేర్కొన్నారు. బ్యాంకులకు చెల్లించాల్సిన రుణాలను నిర్ణీత సమయంలో చెల్లించలేనప్పుడు బ్యాంకులు రుణాల వసూలు బాధ్యతను లోన్ రికవరీ ఏజెంట్లకు అప్పగిస్తాయి. ఇక రుణ గ్రహితలు సకాలంలో చెల్లించలేని రుణాలను వసూలు చేసేందుకు లోన్ రికవరీ ఏజెంట్లు బ్యాంకు తరపున పని చేస్తారు. బ్యాంకులు వీరికి కొంత మొత్తం చెల్లిస్తాయి. వీరు బ్యాంకు ఉద్యోగులు కాదు..థర్డ్ పార్టీ సిబ్బంది. ప్రధానంగా బ్యాంకు రుణాలను వసూలు చేసేందుఉ బ్యాంకులు థర్డ్ పార్టీ సిబ్బందికి బాధ్యతలను అప్పగిస్తుంటాయి. లోన్ రీకవరీ ఏజెంట్లు వేధింపులకు పాల్పడినప్పుడు బాధితులు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. పోలీసులు చర్యలు తీసుకోకపోయినా ఫిర్యాదు నమోదు చేయకపోయినా రుణ గ్రహీతలు నేరుగా సివిల్ కోర్టులో కేసు వేయవచ్చు. కోర్టులు లోన్ రికవరీ ఏజెంట్లను చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడవద్దని ఆదేశించి ఇరు పార్టీలకు లాభదాయకంగా ఉండేవిధంగా మధ్యే మార్గాన్నిసూచించే అవకాశముంది.
Advertisement
రికవరీ ఏజెంట్లు పాటించాల్సిన నిబంధనలు :
Advertisement
లోన్ రికవరీ ఏజెంట్లు ఋణం వసూలు చేసేందుకు వేధింపులకు పాల్పడకూడదని నిబంధనలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఆర్‌బీఐ జారీ చేసిన సర్కులర్‌ను అనుసరించి ఏ సమయంలో పడితే ఆ సమయంలో వినియోగదారులకు ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టకూడదు. వీరు ఉదయం 7 నుంచి రాత్రి 7.30 గంటల మధ్యలోనే రుణం చెల్లింపుల కోసం ఫోన్ చేయడం.. ఇండ్లకు వెళ్లడం వంటివి చేయాలి. రాత్రి 7.30 దాటితే ఫోన్ చేయకూడదు. ఇండ్ల వద్దకు అస్సలే వెళ్లకూడదు. బ్యాంకులు రీకవరి ఏజెంట్ల వివరాలను రుణ గ్రహితకు తెలియజేయాలి. రుణం వసూలు చేసేందుకు వెళ్లిన రికవరీ ఏజెంట్లు తమకు అధికారికంగా ఇచ్చిన బాధ్యతకు సంబంధించిన పత్రాలను చూపించాలి. రికవరీ ఏజెంట్లను మార్చినప్పుడు కూడా ఆ విషయాన్ని బ్యాంకులు రుణ దాతలకు తెలియజేయాలి. ముఖ్యంగా రికవరీ ఏజెంట్లు చేసే కాల్స్, సందేశాలకు సంబంధించిన వివరాలను రికార్డు చేయాలి. ఈ సంభాషణ రికార్డు అవుతున్నట్టు ముందుగానే రుణ గ్రహీతలకు చెప్పాలి. అప్పు చెల్లించాల్సిన విషయం గురించి ఫోన్‌లో మెసేజీ రూపంలో కూడా పంపవచ్చు. ఇది వేధింపుల కిందికి రాదు. అప్పులు వసూలు చేసేందుకు లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరింపు చర్యలకు పాల్పడకూడదని కోర్టులు పేర్కొంటున్నాయి. అయితే ఏజెంట్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని చాలా ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. రుణాలను వసూలు చేసేందుకు బల ప్రయోగం చేయకూడదు. బ్యాంకులు వీరికి కూడా లక్ష్యాలను నిర్దేశిస్తాయి. రుణాల వసూలు చట్టబద్ధంగా మాత్రమే చేయాలని సుప్రీంకోర్టు పేర్కొంది.
లోన్ ఏజెంట్లు దురుసుగా ప్రవర్తించినప్పుడు రుణ గ్రహీతలకు ఉండే హక్కులు
- రుణ గ్రహీతలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేయవచ్చు.
- లోన్ రికవరీ ఏజెంట్లు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడకుండా ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.
- ఆర్‌బీఐ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ సర్క్యులర్ 2.5.4 ప్రకారం.. ఈ నియమాలను ఉల్లంఘించి ప్రవర్తించడాన్ని తీవ్రంగా పరిగణిస్తామని ఆ సంస్థ పేర్కొంది.
- ఫిర్యాదులు వచ్చినప్పుడు బ్యాంకులు ఆ ప్రాంతాల్లో రికవరీ ఏజెంట్లను నియమించుకోవడాన్ని కొంతకాలం పాటు నిషేదించవచ్చు. ఈ నిషేదాన్ని పొడిగించే అవకాశం ఉంది.
- ఆర్‌బీఐ నిబంధనలను ఉల్లంఘించినప్పుడు హైకోర్టులు, సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా జరిమానా విధించినా ఆర్‌బీఐ పర్యవేక్షించే అధికారాలను కలిగి ఉంటుంది. బ్యాంకులు ఎప్పటికప్పుడు ఈ నిబంధనలు సమీక్షిస్తుండాలి.
- బ్యాంకులు రుణ గ్రహీతల ఫిర్యాదులు స్వీకరించినప్పుడు ఆ కేసులను పరిష్కరించే వరకు లోన్ రికవరీ ఏజెంట్లను పంపకూడదు.
- రుణ గ్రహీతలు అనవసర ఫిర్యాదులు చేస్తున్నట్టు బ్యాంకు భావించినప్పుడు రుణాన్ని వసూలు చేసే ప్రక్రియను కొనసాగించవచ్చు.
- వ్యక్తిగత లోన్లు, క్రెడిట్ కార్డు లోన్స్ రూ.10లక్షల లోపు ఉన్నప్పుడు కేసులను లోక్ అదాలత్ కు రిఫర్ చేయవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది.
- బ్యాంకులు వ్యక్తిగత లోన్లు రికవరీ చేసేందుకు లోక్ అదాలత్ సాయం తీసుకోవచ్చని సూచించింది. అవసరమైనప్పుడు బ్యాంకులు రుణ గ్రహీతలకు కౌన్సెలింగ్ ఇచ్చేందుకు క్రెడిట్ కౌన్సిలర్లను నియమించుకోవచ్చు.
Also Read :
భార్యభర్తలు ఒకరినొకరు అతిగా ప్రేమించుకుంటే వచ్చే సమస్యలు ఇవేనట..?