Home » “ఆచార్య” సినిమాలో న‌టించిన ఈ అమ్మాయిని గుర్తుప‌ట్టారా…..? ఆమె ఎవ‌రంటే..!

“ఆచార్య” సినిమాలో న‌టించిన ఈ అమ్మాయిని గుర్తుప‌ట్టారా…..? ఆమె ఎవ‌రంటే..!

by AJAY
Ad

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టించిన ఆచార్య సినిమా ఇటీవ‌ల విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా సినిమాలో రామ్ చ‌ర‌ణ్ కూడా ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించారు. ఇక ఈ సినిమా చిరు కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్ట‌ర్ గా నిలిచింది. సినిమా లుక్ మ‌రియు ట్రైల‌ర్ తో భారీ అంచనాలు నెల‌కొన‌గా విడుద‌లైన త‌ర‌వాత సినిమా చూసిన ప్రేక్ష‌కులు కంగుతిన్నారు.

Advertisement

సినిమాలో క‌థ స‌రిగ్గా లేద‌ని గ్రాఫిక్స్ కూడా దారుణం అని రివ్వ్యూలు ఇచ్చారు. మ‌రో వైపు ఇప్ప‌టి వ‌ర‌కూ కొర‌టాల శివ కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేదు. మిర్చి, జ‌న‌తా గ్యారేజ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌కు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కానీ ఆచార్య చూసిన ప్రేక్ష‌కులు అస‌లు ఈ సినిమాకు కొర‌టాల శివ‌నే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారా అన్న అనుమానం కూడా వ్య‌క్తం చేశారు. సినిమా విడుద‌లైన త‌ర‌వాత కొద్దిరోజుల వ‌ర‌కూ సినిమాకు ట్రోల్స్ బెడ‌ద త‌ప్ప‌లేదు.

Advertisement

ఇదిలా ఉంటే ఈ సినిమాలో కొన్ని పాత్ర‌లు మాత్రం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి. అలా ఆక‌ట్టుకున్న పాత్ర‌ల్లో ఘ‌ట్ట‌మ్మ పాత్ర కూడా ఒక‌టి. చిరు ప‌క్క‌న క‌నిపించే ఘ‌ట్ట‌మ్మ అనే పాత్ర మెప్పించ‌డం తో ఆ అమ్మాయి ఎవ‌రా నెటిజ‌న్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. కాబ‌ట్టి ఆ అమ్మాయి గురించి తెలుసుకుందాం…ఘ‌ట్ట‌మ్మ అనే పాత్ర‌లో న‌టించిన అమ్మాయి పేరు శృతి….కాగా ఆమె సింగ‌ర్. టాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌కు శృతి పాట‌లు పాడింది.

బాల‌య్య హీరోగా న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా అఖండ లో అడిగా అడిగా అనే పాట‌ను శృతి పాడింది. ఈ పాట‌తో పాటూ ఆమె కెరీర్ లో ఎన్నో మంచి పాట‌లు పాడింది. తాజాగా శృతి త‌న ఇన్స్టాగ్రామ్ లో ఆచార్య సినిమాలోని త‌న ఫోటో ను షేర్ చేసింది. ఈ ఫోట‌కు…. న‌ట‌న‌పై త‌నకు ఆస‌క్తి ఉండ‌టంతో కొర‌టాల శివ అవ‌కాశం ఇచ్చార‌ని ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాని పేర్కొంది. చిన్న‌ప్ప‌టి నుండి చిరు సినిమాలు చూసి పెరిగాన‌ని ఆయ‌న అంటే ఎంతో అభిమానం అని చెప్పుకొచ్చింది.

Also read :

వార్నీ…అఖిల్ “ఏజెంట్” లుక్ ను ఆ హాలీవుడ్ సినిమా నుండి కాపీ కొట్టారా..?

Visitors Are Also Reading