Home » ఆర్ఆర్ఆర్ లో లాజిక్ మిస్ అయ్యింద‌ని ట్రోల్ చేస్తున్నవారికి నెటిజ‌న్ దిమ్మ‌తిరిగిపోయే రిప్లై..!

ఆర్ఆర్ఆర్ లో లాజిక్ మిస్ అయ్యింద‌ని ట్రోల్ చేస్తున్నవారికి నెటిజ‌న్ దిమ్మ‌తిరిగిపోయే రిప్లై..!

by AJAY
Ad

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా వ‌స్తుందంటే ముందే అది సూప‌ర్ హిట్ అవుతుంద‌ని ప్రేక్ష‌కులు డిసైడ్ అయిపోతున్నారు. అయితే అది జ‌క్క‌న్న ఇదివ‌ర‌కు చేసిన సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుందా..? లేదా అని మాత్ర‌మే ఆలోచిస్తారు. ఫ్లాపులు ఎర‌గని ద‌ర్శ‌కుడిగా జ‌క్క‌న్న అంత‌టి క్రేజ్ సంపాదించుకున్నారు మ‌రి. ఏకంగా మ‌న దేశ ప్ర‌ధాని మోడీ సైతం తెలుగు సినిమాల‌పై ప్ర‌శంస‌లు కురిపుస్తున్నారంటే అది జ‌క్క‌న్న వ‌ల్ల వచ్చిన క్రేజ్ అనే చెప్పాలి.

Advertisement

మ‌గ‌ధీర సినిమాతో రికార్డులు క్రియేట్ చేసిన జ‌క్క‌న్న అన్ని ఇండ‌స్ట్రీల ప్రేక్షుకుల‌ను త‌న వైపు తిప్పుకున్నాడు. ఇక బాహుబ‌లి సినిమాతో పాన్ ఇండియా అంటూ స‌రికొత్త దారిని చూపించి తెలుగుతో పాటూ ఇత‌ర భాష‌ల సినిమాలకు కూడా ఒక ప్ర‌త్యేక గుర్తింపును తీసుకువ‌చ్చారు. జ‌క్కన్న ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవ‌ల మ‌రో భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా కూడా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో టాలీవుడ్ నుండి ఇద్ద‌రు స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చ‌రణ్ న‌టించారు.

Advertisement

అంతే కాకుండా బాలీవుడ్ న‌టీన‌టులు సైతం ఈ సినిమాలో క‌నిపించారు. ఇక ఈ సినిమా థియేట‌ర్ ల‌లో భారీ విజ‌యం సాధించ‌గా ఓటీటీలో విడుద‌లైన నాటి నుండి సినిమాలోని మిస్టేక్ ల‌ను ప‌ట్టుకుని నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. సినిమాలో ఎన్టీఆర్ బ్రిటిష్ అధికారి భ‌వ‌నం పైకి పులులు, జింక‌ల‌ను తీసుకువెళ్లి దాడి చేసే సీన్ లో వాటిని ఒకే బోన్ లో చూపించాడు.

కాగా జింక‌లు, పులుల‌ను ఒకే బోన్ ఉంచ‌డం ఏంటి ఇదెక్క‌డి లాజిక్ జ‌క్కన్నా అంటూ ట్రోల్ చేస్తున్నారు.కాగా ఓ నెటిజ‌న్ అలా ట్రోల్ చేస్తున్నవారికి దిమ్మ‌తిరిగే రిప్లై ఇచ్చాడు. జంగ‌ల్ బుక్ సినిమాలో పులులు, సింహాలు, కుందేళ్లు, జింక‌లు ఇలా అన్నీ క‌లిసిమెలిసి ఉంటాయి క‌దా…ఇది కూడా అంతే అంటూ రిప్లై ఇచ్చాడు. ఆ నెటిజ‌న్ రిప్లై కు మ‌రి కొంద‌రు స‌పోర్డ్ చేస్తూ సూప‌ర్ రిప్లై బ్రో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ALSO READ :

వార్నీ…అఖిల్ “ఏజెంట్” లుక్ ను ఆ హాలీవుడ్ సినిమా నుండి కాపీ కొట్టారా..?

Visitors Are Also Reading