ఎంతో కాలం నుంచి దేశవ్యాప్తంగా చాలామంది నిరుద్యోగులు ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికి రైల్వే శాఖ గుడ్ న్యూస్ అందించింది.. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందినటువంటి వెస్టర్న్ సెంట్రల్ రైల్వే వివిధ యూనిట్లలో 2521 అప్రెంటిస్ పోస్టులకు గాను అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నోటిఫికేషన్ జారీ చేసింది.. ఈ నోటిఫికేషన్ లో కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, డ్రాఫ్ట్ మెన్, ప్లంబర్, ఫిట్టర్, వెల్డర్ వంటి వివిధ రకాల విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారని తెలుస్తోంది..
Advertisement
also read:షాయాజీ షిండే నన్ను మోసం చేశాడు.. ఫిర్యాదు చేసిన నిర్మాత..
Advertisement
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేటువంటి అభ్యర్థులు గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి పదవ తరగతి లేదా ఇంటర్మీడియట్ 55 శాతం మార్కులతో పాసై ఉండాలి. అంతేకాకుండా నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కూడా కలిగి ఉండాలి.. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు డిప్లమా హోల్డర్స్ కు అవకాశం లేదు.. అభ్యర్థుల వయసు నవంబర్ 17 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.. రిజర్వేషన్ ఉన్న వారికి వయోపరిమితి విషయంలో సడలింపు ఉంటుంది. దీనికి అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా డిసెంబర్ 17వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు జనరల్ అభ్యర్థులు అయితే వంద రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుసి, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. అకాడమిక్ మెరిట్ మరియు షార్ట్ లిస్టింగ్ ద్వారా ఎంపిక చేస్తారు..
మొత్తం ఉద్యోగాలు:
హెచ్ క్యూ, బాబల్పూర్ డివిజన్ లో – 20
బాబల్పూర్ డివిజన్ లో -884
కోట వర్క్ షాప్ డివిజన్ లో– 160
సిఆర్ డబ్ల్యుఎస్ బిపిఎల్ డివిజన్ లో -158
కోట డివిజన్ లో-685
భోపాల్ డివిజన్ లో -614
also read: