Home » Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి

Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది.  ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 30.04.2023 నుంచి 06.05.2023 వరకు మేషం :

Mesha

Mesha

ఉద్యోగంలో వృద్ధి సాధిస్తారు. ధైర్యంగా చేసే పనుల్లో విజయం సాధిస్తారు. కాస్త ఒత్తిడి తగ్గుతుంది. ధర్మ మార్గంలో సత్ఫలితాలను సాధించాలి. ఓర్పు చాలా అవసరం. కీలకమైన విషయాలను ఇతరులతో చర్చించకూడదు. వ్యాపారంలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడాలి. 

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

అవసరానికి ధనం అందుతుంది. ఉద్యోగంలో ఒత్తిడిని జయిస్తారు. తోటివారిని సంప్రదిస్తూ కార్యసిద్ధిని సాధించాలి. కుటుంబ సౌఖ్యం సూచిస్తుంది. మిత్రుల బలంతో ఓ కార్యం విజయవంతంగా పూర్తవుతుంది. ఇతరుల విషయాల్లో అస్సలు తలదూర్చకూడదు. వ్యాపారంలో శ్రద్ధ చాలా అవసరం.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

దృష్టవంతులు అవుతారు. ఆశించిన ఫలితాలుంటాయి. అనుకున్న స్థితికి చేరుతారు. కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారంలో శుభ ఫలితాలుంటాయి. 

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

ప్రారంభించిన కార్యక్రమాలు పూర్తి అవుతాయి. మిత్రుల సహకారంతో లక్ష్యాలను  విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ కలహాలకు దూరంగా ఉండటం ఉత్తమం. నిరంతర సాధన చాలా అవసరం. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

కుటుంబ సభ్యుల వల్ల ఓ విజయం లభిస్తుంది. ప్రశాంత చిత్తంతో నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి. ఆశయం నెరవేరుతుంది. ఆత్మీయుల నుంచి తగినంత సహకారముంటుంది. ఉద్యోగంలో అధికారుల మన్ననలు పొందుతారు. స్థిరమైన నిర్ణయాలతో బంగారు భవిష్యత్ లభిస్తుంది.

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

సరైన నిర్ణయాలతో విజయం సాధిస్తారు. ఏకాగ్రతతో పని చేసి పెద్దలను మెప్పించాలి. పనులను వాయిదా వేస్తే విఘ్నాలు ఎక్కువ అవుతాయి. ఇంట్లో వారితో మిత్రులతో సంప్రదించి పని చేయడం చాలా ఉత్తమం. సొంత నిర్ణయాలు ఇబ్బంది పెడుతాయి.

Advertisement

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

సకాలంలో పని చేసి విజయం సాధిస్తారు. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. ప్రోత్సహించే వారు ఉన్నారు. బుద్ధిబలంతో పని చేసి ప్రశంసలు పొందాలి. మొహమాటం లేకుండా ధర్మమార్గంలో ముందుకు వెళ్లాలి. ఎదురుచూస్తున్న పనిలో విజయం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సహనంగా వ్యవహరించాలి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉంటాయి. క్రమ క్రమంగా అభివృద్ధి సాధిస్తారు. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. సంతృప్తికర ఫలితాలుంటాయి. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. ఆర్థికాభివృద్ధి సాధిస్తారు. వాద ప్రతివాదాలతో కాలం వృధా చేయకూడదు. 

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

సకాలంలో పనులను ప్రారంభిస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది. ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు. వ్యాపారంలో శ్రద్ధ వహించకపోతే నష్టాలు సంభవించే అవకాశముంది. ఆలోచించి ఖర్చు చేయడం ఉత్తమం. అనవసరంగా అస్సలు ఆవేశపడకూడదు.

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

ఉద్యోగంలో ఉన్నతస్థాయి అధికారుల నుంచి ప్రశంసలుంటాయి. పలు మార్గాలలో ధనయోగం సూచితం. నాలుగు రకాలుగా ఆలోచించి పని చేయగల శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఆర్థికాభివృద్ధిని సాధించాలి. సత్సంకల్పంతో పని చేయడం ఉత్తమం. ఎవ్వరి మాటలు మనస్సుకు తీసుకోవద్దు. కలహాలకు దూరంగా ఉండాలి. 

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

ఉద్యోగ ఫలితాలుంటాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. ఆర్థికంగా కలిసొస్తుంది. ఇంట్లో వారితో చాలా ప్రేమగా మెలగాలి. అపార్థాలకు అస్సలు తావులేకుండా మాట్లాడాలి.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

మంచి మనస్సుతో పని ప్రారంభించండి. విశేషమైన ప్రయత్నాల ద్వారా లాభపడుతారు. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. బంగారు భవిష్యత్ కి అవసరమైన నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి. ఆర్థికంగా బలపడుతారు. భూ గృహ వాహన యోగాలుంటాయి. 

Visitors Are Also Reading