Telugu News » Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది

by Anji

 రాశి ఫలాలు చదవడం ద్వారా ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ముందే తెలుసుకోవొచ్చు. ఈ వారం ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Ads

Weekly Horoscope in Telugu తెలుగులో వీక్లీ జాతకం 22 .05.2022 నుండి 28.05.2022 వరకు

మేషం :

ఉద్యోగంలో లక్ష్యంపై దృష్టి పెట్టండి. తెలియ ని విఘ్నాలున్నాయి. ఏకాగ్ర‌త చాలా అవ‌స‌రం. వ్యాపారంలో కాలిసి వస్తుంది. శ్రమ పెరిగినా అంతిమంగా విజయం సాధిస్తారు. ఒత్తిడికి గురి చేసే వారు ఉన్నారు. వివాదాల జోలికి పోవద్దు. మిత్రుల సలహా పాటించండి. వారం చివరిలో మేలు జరుగుతాయి.

తెలుగులో వీక్లీ జాతకం : వృషభం 


ఉత్సాహంగా ప ని చేయండి. అవరోధాలు తొలగిపోతాయి. అనుకున్న ఫలితం దక్కుతుంది. ఉద్యోగంలో బాగుంటుంది. ఆర్థికంగా క‌లిసి వ‌స్తుంది. వ్యాపార లాభాలు ఉంటాయి. గ’త వైభవం సిద్ధిస్తుంది. త‌గినంత మాన‌వ ప్ర‌య‌త్నంలో సంక‌ల్పాన్ని సాధించ‌గ‌ల‌రు. కాలానుగుణంగా నిర్ణయాలను తీసుకొని ధర్మబద్ధంగా ఆచరించండి.

తెలుగులో వీక్లీ జాతకం : మిథునం

ముఖ్య కార్యాల్లో అప్ర‌మ‌త్తంగా ఉంటూ కార్య‌సిద్ధిని సాధించాలి. పట్టు సడల లేకుండా చూసుకోండి. గంద‌రగోళ స్థితి గోచరిస్తుంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలాలు ఉంటాయి. వ్యాపారంలో శ్రమకు తగ్గ ఫలితం, సమాజంలో పేరు లాభిస్తుంది. ఇంట్లో వారి సూచనలను స్వీకరించాలి.

తెలుగులో వీక్లీ జాతకం : కర్కాటకం

కర్కాటక రాశి స్వభావం కర్కాటక రాశి

బ్రహ్మాండమైన కాలం నడస్తోంది. ఎటు చూసినా శుభ ఫ‌లితాలే గోచ‌రిస్తున్నాయి. ఎదురు చూస్తున్న ప ని పూర్తవుతుంది. ధైర్యంగా నిర్ణ‌యాలు తీసుకోండి. ఉద్యోగంలో అధికారుల ప్ర‌శంస‌లు ఉంటాయి. స్థిరత్వం వ‌స్తుంది. వ్యాపార బలం పెరుగుతుంది. భ‌విష్యత్‌ను నిర్మించుకునే కాలం ఇది.

తెలుగులో వీక్లీ జాతకం : సింహం

అభీష్ట సిద్ధి కలుగుతుంది. మ‌న‌సు పెట్టి చేసే ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. కొన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిస్కారం దొరుకుతుంది. ఉద్యోగం బాగుంటుంది. వ్యాపారంలో స్వల్ప విఘ్నాలున్నాయి. క‌ల నెర‌వేరుతుంది.

తెలుగులో వీక్లీ జాతకం : కన్య

తగినంత కృషి చేయండి. అదృష్ట యోగం ఉంటుంది. ప్ర‌యత్నాలు ఫ‌లించే స‌మ‌యం. ఉద్యోగంలో మేలు చేసే వారు ఉన్నారు. గొప్ప ఆలోచనలను వస్తాయి. స‌కాలంలో ఆచ‌ర‌ణ పెట్టాలి. మొహమాటం వల్ల ఖర్చు పెరుగుతుంది. తోటివారిని క‌లుపుకుని వెళ్లాలి. మంచి పనులతో కీర్తి సంపాదిస్తారు.

తెలుగులో వీక్లీ జాతకం : తుల

ముఖ్య కార్యాలలో శ్రద్ధ పెంచాలి. అధిక శ్రమతో లక్ష్యాన్ని చేరతారు. విసుగు చెందకుండా పనులు పూర్తి చేసుకోవాలి. ఉద్యోగంలో తెలియ ని ఆటంకం ఉంటుంది. స‌మ‌య‌స్పూర్తితో అధిగ‌మించాలి. కలహాల’కు అవకాశం ఉంది. నిందలు మోపే వారు ఉన్నారు. ఆర్థిక విషయాలలో జాగ్రత్త. కుటుంబ స‌భ్యుల స‌ల‌హాలు ప‌ని చేస్తున్నారు.

తెలుగులో వీక్లీ జాతకం : వృశ్చికం 

ఉద్యోగంలో మంచి జరుగుతుంది. కోరికలు ఒక్కొక్కటిగా సిద్ధిస్తాయి. ముఖ్య కార్యాలలో శీఘ విజయం ఉంది. బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా పూర్తి చేస్తారు. అపోహలు తొలగిపోతాయి. కొత్త బంధాలు చిగురిస్తాయి. పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. ఆర్థికంగా క‌లిసి వ‌స్తుంది. గృహ‌వాహ‌నాది ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం అవుతాయి. వ‌స్తు ప్రాప్తి సూచితం.

తెలుగులో వీక్లీ జాతకం : ధనస్సు

ఉద్యోగ ఫలితం అద్భుతం. మంచి పనులు చేసి ప్ర‌శంస‌లు పొందుతారు. అభీష్టాలు సిద్ధిస్తాయి. బుద్ధిబలంతో పెద్దలను మెప్పిస్తారు. బాధ్యతలను సకాలంలో పూర్తి చేయండి. అనుకున్న స్థానం లభిస్తుంది. వ్యాపారం బాగుంటుంది. నూత‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. ధనలాభం ఉంది. ఇంట్లో వారిని సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి.

తెలుగులో వీక్లీ జాతకం : మకరం

ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపార బలం పెరుగుతుంది. ధనలాభం ఉంది. ధ‌ర్మ‌బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌ర‌స్తే కాలం మిశ్ర‌మంగా ఉన్న‌ప్ప‌టికీ ల‌క్ష్యాన్ని చేరుకుంటారు. దేనికి తొంద‌ర‌ప‌డ‌వ‌ద్దు. మనోబలంతో ముందుకు సాగండి. నిదానంగా మిత్రులతో కలిసి చేసే పనులు త్వరగా కార్యసిద్ధిని ఇస్తాయి.

తెలుగులో వీక్లీ జాతకం : కుంభం

వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో సులభంగా విజయం లభిస్తుంది. ధనలాభం ఉంటుంది. కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సరైన ప్రణాళికతో మంచి భవిష్యత్‌ను సాధించండి. అపార్థాల‌కు తావివ్వ‌కుండా ప‌ట్టువిడుపుల‌తో ముందుకు సాగాలి.

తెలుగులో వీక్లీ జాతకం : మీనం

ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలుంటాయి. అధికారులనుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది. అభీష్టసిద్ధి ఉంది. ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోండి. లక్ష్మీఅనుగ్రహం లభిస్తుంది. ఆవేశపరిచే పరిస్థితులు ఉంటాయి. సంయమనాన్ని పాటించండి. వ్యాపారంలో జాగ్రత్త. ధర్మమార్గంలో పయనించండి. మిత్రుల అంద లభిస్తుంది.

 


You may also like