రాశి ఫలాలు చదవడం వల్ల ఏ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ వారం ఎవరెవరి రాశి ఫలాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Weekly Horoscope in Telugu 09.10.2022 నుండి 15.10.2022 వరకు
మేషం :
Mesha
ఉద్యోగంలో అధికార లాభం ఉంటుంది. నిర్మలమైన మనసుతో న్యాయబద్ధంగా నడుచుకుంటే విజయం మీదే అవుతుంది. పరీక్షించే వ్యక్తులున్నారు. సౌమ్యంగా సమాధానమివ్వాలి. ఓర్పు చాలా అవసరం. అపరిచితులతో చనువుగా ఉండవద్దు. మిత్రుల వల్ల శాంతి లభిస్తుంది. కొత్తగా ఆలోచిస్తూ వ్యాపారాన్ని వృద్ధి చేయాలి.
Weekly Horoscope in Telugu: వృషభం
Vrushabha
ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. మీ పనులు అందరికీ నచ్చుతాయి. ఒక మెట్టు పైకి ఎక్కుతారు. తగిన గౌరవం లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మంచి జీవితం లభిస్తుంది. గృహ వాహన యోగాలు ఉన్నాయి. అర్హతలను పెంచుకుంటూ ముందుకు వెళ్లాలి. కాలం సహకరిస్తోంది. ఆశయాలు నెరవేరుతాయి.
Weekly Horoscope in Telugu : మిథునం
Mithuna
ఉత్తమ కార్యచరణతో విజయం లభిస్తుంది. ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెంచాలి. అధికార లాభం సూచితం. వ్యాపారంలో శుభం కలుగుతుంది. మంచి ఆలోచనలతో లక్ష్యాన్ని చేరండి. అన్ని విధాలుగా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు చేపట్టే పనులు స్థిరమైన భవిష్యత్ నిస్తాయి. నూతన ప్రణాళికలు సిద్ధిస్తాయి.
Weekly Horoscope in Telugu : కర్కాటకం
Karkataka
మంచి కాలం నడుస్తోంది. ముఖ్యకార్యాల్లో శ్రద్ధ పెట్టండి. సద్గోషి వల్ల జ్ఞానం లభిస్తుంది. కృతనిశ్చయంతో ముందుకు వెళ్లండి. అదృష్టవంతులు అవుతారు. ఒక సమస్య నుంచి బయటపడుతారు. చంచలత్వం లేకుండా పని చేయండి. ధనలాభం కలుగుతుంది. వ్యాపారంలో ఆటంకాలు ఉన్నప్పటికీ ధైర్యంగా అధిగమిస్తారు.
Weekly Horoscope in Telugu : సింహం
Simha
వ్యాపార లాభం ఉంది. నూతన ప్రయత్నాలు సిద్ధిస్తాయి. విజ్ఞానపరంగా అభివృద్ధి ఉంటుంది. ప్రయత్నబలం ఉంటే తిరుగులేని శక్తిగా ఎదుగుతారు. ధర్మమార్గాన్ని అనుసరించండి. లక్ష్యం చేరువలోనే ఉంది. సందేహించకుండా నిర్ణయం తీసుకోండి. సంపదలు పెరుగుతాయి.
Weekly Horoscope in Telugu : కన్య
Kanya
అదృష్టఫలాలు అందుతాయి. బద్ధకించకుండా పని చేయాలి. ఉద్యోగరిత్యా అనుకూల కాలం. ఒత్తిడి కలిగించే పరిస్థితులున్నాయి. చాకచక్యంగా వ్యవహరించాలి. బాధ్యతలను సక్రమంగా పూర్తి చేయాలి.పనులను ఆపకుండా క్రమపద్దతిలో చేయాలి. కుటుంబపరంగా కలిసి వస్తుంది.
Advertisement
Weekly Horoscope in Telugu : తుల
Thula
ఏకాగ్రతతో పని ప్రారంభించండి. అడుగడుగునా విఘ్నాలున్నాయి. ధర్మచింతన మేలు చేస్తుంది. ఉద్యోగంలో ఆటంకం తొలగుతుంది. అపార్థాలకు తావివ్వవద్దు. సంభాషణలో స్పష్టత అవసరం. ఇంట్లో వారి సూచన పని చేస్తుంది. ఆపదల నుంచి బయటపడతారు. చెడు ఆలోచనలు వద్దు. వ్యాపారంలో జాగ్రత్త అవసరం.
Weekly Horoscope in Telugu : వృశ్చికం
VruChika
ధైర్యంగా పనులు ప్రారంభించండి. ఉత్తమ ఫలితాలు వస్తాయి. కాలం సహకరిస్తోంది. అభిష్టసిద్ధి ఉంది. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. స్థిరంగా నిర్ణయం తీసుకోండి. విఘ్నాలు తొలగుతాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. గృహ వాహనాది లాభాలు ఉంటాయి. మిత్రులవల్ల మంచి జరుగుతుంది.
Weekly Horoscope in Telugu : ధనుస్సు
Dhanassu
ఉద్యోగంలో తగినంత గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలు ఉంటాయి. ప్రతిభతో అభివృద్ధి సాధిస్తారు. సాధనలో లోపం లేకుండా చూసుకోవాలి. అనుకున్నది సాధించే కాలమిది. పట్టుదలతో పని చేయండి. జీవితాశయం నెరవేరుతుంది. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వ్యాపారం శుభప్రదం. ధనధాన్య లాభం ఉంటుంది.
Weekly Horoscope in Telugu : మకరం
Makara
స్థిరచిత్తంతో పని ప్రారంభించండి. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్న ఫలితం సానుకూలంగా ఉంటుంది. ప్రతిభతో పెద్దలను ఆకర్షిస్తారు. మీ వల్ల కొందరికీ మేలు జరుగుతుంది. శత్రుదోషం తొలుగుతుంది. మొహమాటాన్ని పక్కన పెడితే మంచి భవిష్యత్ లభిస్తుంది. సమిష్టికృషి కుటుంబ సభ్యులకు శుభాన్నిస్తుంది.
Weekly Horoscope in Telugu : కుంభం
Kumbham
ఉద్యోగంలో అద్భుతంగా ఉంటుంది. సకాలంలో పనులు ప్రారంభిస్తే తిరుగులేని ఫలితాలు సిద్ధిస్తాయి. ఆలోచనలు ప్రగతివైపు నడిపిస్తాయి. అధికారబలం పెరుగుతుంది. ఆదర్శంగా నిలుస్తారు. బంగారు భవిష్యత్‌కి అవసరమైన ప్రణాళికలు సిద్ధించే కాలమిది. కొత్తగా ఆలోచించాలి. క్షమాగుణంతో పని చేస్తే కీర్తిమంతులు అవుతారు.
Weekly Horoscope in Telugu : మీనం
Meena
మనోబలంతో విఘ్నాలను అధిగమించాలి. స్థిరచిత్తంతో ముందడుగు వేయాలి. ధర్మం కాపాడుతుంది. ఉద్యోగ రిత్యా మిశ్రమకాలం. సద్బుద్ధితో పని చేయాలి. వారం మధ్యలో ఒక కార్యం సఫలమవుతుంది. వృథా వ్యయం పనికిరాదు. ఆపద నుంచి బయటపడతారు. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి.
Advertisement