Home » Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం

Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారు వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది.  ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 07.04.2023 నుంచి 13.05.2023 వరకు మేషం :

Mesha

Mesha

సకాలంలో మీ యొక్క పనులను విజయవంతంగా పూర్తి చేయండి. ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ధైర్యం చాలా అవసరం. లక్ష్యం పూర్తయ్యేవిధంగా ఇతర పనుల్లో అస్సలు తలదూర్చకూడదు.  వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. అవసరానికి ధనం అందుతుంది.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

మనోబలంతో పనులను ప్రారంభించండి. తెలియకుండానే ఆటంకాలు ఎదురవుతాయి. సమయస్ఫూర్తి చాలా అవసరం. లక్ష్యాన్ని చేరే వరకు శ్రమించడం ఉత్తమం. సహనం శక్తిని ఇస్తుంది. మిత్రుల సహకారంతో ఓ విజయం లభిస్తుంది. వ్యాపారంలో సొంత నిర్ణయాలు మీకు ఫలితాన్ని ఇస్తాయి.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు చాాలా లభిస్తాయి. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. తలచిన కార్యాలు విజయవంతంగా పూర్తి అవుతాయి. అనుభవంతో నిర్ణయాలు తీసుకోండి. తోటివారి సహకారం లభిస్తుంది. అద్భుతమైన వ్యాపార యోగం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలి. అనుకున్నది సిద్ధించేవరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. పట్టుదల చాలా అవసరం. విజయం చేరువలోనే ఉంది. ప్రతిభతోనే విఘ్నాలను అధిగమించాలి. వ్యాపారంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి.  వాటిని ఎదుర్కునేందుకు సమయస్ఫూర్తి చాలా అవసరం. ఎవరిపైనా ఆధారపడకూడదు. ప్రతీ పని ఇంట్లో వారికి చెప్పి చేయాలి.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

మీ యొక్క  కృషికి తగిన ఫలితం లభిస్తుంది. నిరంతర సాధనతో లక్ష్యాలను విజయవంతంగా పూర్తి చేయండి. మీరు దేనిని అయితే వెతుకుతారో అది మీకు లభిస్తుంది. అనుభవజ్ఞుల సూచనలతో స్థిరమైన ఫలితాలను సాధించండి. భూగృహ వాహనాది యోగాలు అనుకూలిస్తాయి. 

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

మనోబలంతో మీరు ముందుకు సాగుతారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండటం ఉత్తమం. ఒత్తిడి లేకుండా సకాలంలో బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేయండి. సౌమ్యంగా సంభాషించాలి. వివాదాలకు అవకాశం ఇవ్వకూడదు. మిత్రుల సహకారం చాలా అవసరం. ఆటంకాలను బుద్దిబలంతో అధిగమించాలి.

Advertisement

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

ఉత్సాహంగా పని చేయండి. గుర్తింపు గౌరవం లభిస్తుంది. సకాలంలో విజయవంతంగా  పనులు పూర్తి చేయడం ద్వారా లక్ష్యం సిద్ధిస్తుంది. ఎదురుచూస్తున్న పనుల్లో విజయముంటుంది. పెట్టుబడులు లాభిస్తాయి. శత్రుదోషం తొలుగుతుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఓ పని విజయవంతంగా పూర్తి అవుతుంది.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది. అధికారులు ప్రసన్నులు అవుతారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. వ్యాపారంలో అభివృద్ధి కలుగుతుంది. భూ గృహ వాహన యోగాలు ఉన్నాయి. మీ వల్ల కొందరికీ మేలు కలుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ కలహాలకు దూరంగా ఉండాలి. 

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో విజయం సాధిస్తారు. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. స్థిర నిర్ణయాలు మీకు శక్తిని ఇస్తాయి. పట్టుదలతో పని చేస్తే విజయం మిమ్మల్ని వరిస్తుంది. పనులను వాయిదా వేయకపోవడం చాలా మంచిది. నమ్మకంగా పని చేస్తే అవరోధాలు తొలగిపోతాయి.

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

వ్యాపారం వృద్ధి చెందుతుంది. వృథా ఖర్చులను తగ్గించుకోవడం ఉత్తమం. ఉద్యోగంలో శుభ ఫలితాలు సాధిస్తారు. శాంతంగా మాట్లాడితే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. బాధ్యతలను సకాలంలో విజయవంతంగా పూర్తి చేయడం ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు బంగారు భవిష్యత్ ని ఇస్తాయి. 

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

ఉద్యోగం చాలా బాగుంటుంది. సహనం కాపాడుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారంలో ఎదురయ్యే సమస్యలను బుద్ధిబలంతో పరిష్కరించాలి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం. కొన్ని సంఘటనలు ఇబ్బంది పెడుతాయి. దేనిని కూడా లోతుగా ఆలోచించకూడదు.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

మీకు వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. సకాలంలో మీరు తీసుకునే నిర్ణయాలతో అభిష్ట సిద్ధి కలుగుతుంది. ధన యోగం సూచితం. మిత్రుల సహకారం అందుతుంది. ఆశయాలు నెరవేరుతాయి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పనుల్లో పురోగతి సాధిస్తారు. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. మీ యొక్క విఘ్నాలు తొలగిపోతాయి.

Visitors Are Also Reading