Weekly Rasi Phalau in Telugu 2023: రాశిఫలాలు చదవడం వల్ల ఏ రాశి వారి యొక్క ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
Weekly Horoscope in Telugu 05.02.2023 నుంచి 11.02.2023 వరకు మేషం :
Mesha
ఆత్మవిశ్వాసం మీకు మెండుగా కనిపిస్తుంది. త్వరలోనే విజయం సాధిస్తారు. ఓర్పు, ఏకాగ్రత చాలా అవసరం. నమ్మిన సిద్ధాంతంతోనే ముందుకు సాగాలి. ఆవేశపరిచేవారు ఉన్నారు జాగ్రత్త. వ్యాపారంలో అనేక ఇబ్బందులుంటాయి. సమయస్ఫూర్తి ప్రదర్శించండి.
Weekly Horoscope in Telugu 2023: వృషభం
Weekly Rasi Phalau in Telugu
సకాలంలో పనులు ప్రారంభించండి. లక్ష్యం సిద్ధించేవరకు కృషిని ఆపకూడదు. ఉద్యోగంలో గౌరవం రోజు రోజుకు పెరుగుతుంది. ఒత్తిడిని అధిగమించాలి. అందరితో సౌమ్యంగా నడుచుకోవాలి. వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరించండి.
Weekly Horoscope in Telugu : మిథునం
Mithuna
ఆర్థిక విషయాల్లో కలిసి వస్తుంది. అవసరాలకు చేతికి ధనం అందుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచడం ఉత్తమం. కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. సరైన ప్రణాళికతో చేసే పనులు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో శ్రమ పెరుగుతుంది. సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడాలి. వివాదాలకు అవకాశం ఇవ్వకూడదు. వ్యాపారంలో సొంత నిర్ణయాలు చాలా మంచిది.
Weekly Horoscope in Telugu : కర్కాటకం
Karkataka
అద్భుతమైన విజయాలను సాధిస్తారు. పలు మార్గాలలో లబ్ధిపొందుతారు. అభివృద్ధి పరంగా బాగుంటుంది. ఉద్యోగంలో అధికార లాభం ఉంటుంది. పెద్దల ఆశీస్సులతో పైకి వస్తారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న పని పూర్తి అవుతుంది.
Weekly Horoscope in Telugu : సింహం
Simha
కాలం చాలా మిశ్రమంగా ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. స్వయంగా చేసే పనులు మంచి విజయాన్ని అందిస్తాయి. ధర్మం మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతుంది. కొన్ని విషయాల్లో మాత్రం గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశముంది.
Weekly Horoscope in Telugu : కన్య
Advertisement
Kanya
ప్రశాంతంగా పనులను ప్రారంభించడం ఉత్తమం. విజయం మిమ్మల్ని వరిస్తుంది. ఉద్యోగంలో కీర్తి, ప్రతిష్టలు పొందుతారు. సమయానుకూల నిర్ణయాలతో వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు ఉంటాయి. ఓ విషయం చేతి దాకా వచ్చి ఆగిపోతుంది. ఓర్పుతో ప్రయత్నించడం ఉత్తమం.
Weekly Horoscope in Telugu : తుల
Thula
మనోబలంతో సత్వర విజయం లభిస్తుంది. అవసరాలకు ధనం చేకూరుతుంది. మొహమాటం వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి. తొందరలో పొరపాటు జరగనివ్వకూడదు. సమస్యను అర్థం చేసుకొని శాంతంగా పరిష్కరించుకొండి. అనుకున్న మార్గంలోనే ముందుకు వెళ్లండి.
Weekly Horoscope in Telugu : వృశ్చికం
VruChika
కాలం మీకు సహకరిస్తుంది. విశేషమైన గుర్తింపు మీకు లభిస్తుంది. ఉద్యోగంలో పెద్దల అనుగ్రహంతో అభివృద్ధిని సాధిస్తారు. అధికార లాభం ఉంటుంది. మీ సొంత నిర్ణయాలు నలుగురికి ఉపయోగపడుతాయి. వ్యాపారంలో అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి.
Advertisement
Weekly Horoscope in Telugu : ధనుస్సు
Dhanassu
ఎలాంటి సందేహాలు లేకుండా నిర్మొహమాటంగా మీ నిర్ణయం తీసుకోండి. అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. గతంలో కాదనుకున్న పని ఇప్పుడు విజయవంతంమవుతుంది. ఉద్యోగంలో పైకి వస్తారు. వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్త వహించాలి. బంధు, మిత్రుల వల్ల ఆనందం కలుగుతుంది.
Weekly Horoscope in Telugu : మకరం
Makara
సంకల్పబలంతో మీ లక్ష్యాన్ని చేరుకోండి. కృషి చాలా అవసరం. తెలియని ఆటంకం ఉంటుంది. ఉద్యోగంలో కష్టపడితేనే ఫలితం ఉంటుంది. సౌమ్యంగా సంభాషించాలి. అపార్థాలకు అవకాశం ఇవ్వకూడదు. స్వయం కృషి లభిస్తుంది. వ్యాపారంలో ఆచితూచి అడుగువేయాలి. చిన్న పొరపాటు మీకు పెద్ద నష్టం కలిగిస్తుంది.
Weekly Horoscope in Telugu : కుంభం
Kumbham
అద్భుతమైన విజయాలు మిమ్మల్ని వరిస్తున్నాయి. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఇబ్బందుల నుంచి బయటపడుతారు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. స్థిరత్వం ఏర్పడుతుంది. గతంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఉన్నత స్థితి మిమ్మల్ని గోచరిస్తుంది.
Weekly Rasi Phalau in Telugu : మీనం
Meena
అద్భుతమైన విజయాలను సాధిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇబ్బందుల నుంచి బయటపడుతారు. ఉద్యోగంలో మీకు మేలు జరుగుతుంది. గతంలో ఉన్నటువంటి కొన్ని సమస్యతు పరిష్కారమవుతాయి. దృఢ సంకల్పంతో అనుకున్నది సాధిస్తారు.