Home » Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఈ వారంలో ఆ రాశుల వారికి అకస్మిక ధనలాభం కలుగుతుంది

Weekly Horoscope in Telugu 2023 : వార ఫలాలు.. ఈ వారంలో ఆ రాశుల వారికి అకస్మిక ధనలాభం కలుగుతుంది

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది.  ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 03.09.2023 నుంచి 09.09.2023 వరకు మేషం :

Mesha

Mesha

అనుకున్న పనులు సాధ్యమవుతాయి. ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని అలము చేయండి. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ఉత్తమం. వ్యాపారంలో శ్రద్ధ తీసుకోవాలి. తొందరపాటు అస్సలు పనికిరాదు.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

వ్యాపారం చాలా అద్భుతంగా ఉంటుంది. క్రమ క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ముందుగా అనుకున్న సమయానికే పనులను ప్రారంభించండి. మధ్యలో మార్చకూడదు. ఉద్యోగంలో ఎప్పటి పనులు అప్పుడే విజయవంతంగా పూర్తి చేయాలి. కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు కలిగే అవకాశముంది. కుటుంబ సూచనలు మేలు చేస్తాయి. 

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

విశేషమైన శుభాలు కలుగుతాయి. ఉద్యోగంలో ప్రశంసలు లభిస్తాయి. ఏ పని చేసినా లాభం ఉంటుంది. భూ గృహ వాహన యోగాలు అనుకూలిస్తాయి. జీవితాశయాలపై దృష్టి నిలపండి. ఎదురుచూస్తున్న పనుల్లో మంచి ఫలితాలుంటాయి. ఇతరులపై అస్సలు ఆధారపడకూడదు. 

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

విజయ అవకాశాలు ఉన్నాయి. అశ్రద్ధ చేయకుండా సకాలంలో బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేయండి.  లాభాలను గడిస్తారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. పట్టువిడుపులు అవసరం. ఉద్యోగంలో శ్రద్ధ పెట్టాలి.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

కీలకమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అనుకున్న సమయానికి ముందుగానే పనులను ప్రారంభించండి. ఏకాగ్రతతో చేసే పనులు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సంభాషణల్లో స్పష్టత చాలా అవసరం. నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

ప్రతీ అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. లక్ష్యం స్పష్టంగా ఉండటం ఉత్తమం. మొహమాటం వల్ల కొత్త సమస్యలురాకుండా చూసుకోవాలి. డబ్బును అస్సలు వృధా చేయకూడదు. ఇతరుల విషయాల్లో తలదూర్చకూడదు. వారం మధ్యలో తెలియని ఆటంకాలుంటాయి. 

Advertisement

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

 

అనుకున్న పనులు త్వరగా పూర్తి అవుతాయి. ఉద్యోగంలో ఉన్నతస్థితి గోచరిస్తోంది. ఎదురుచూస్తున్న పనుల్లో అభివృద్ధి సాధిస్తారు. లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయడం వల్ల లాభాలు పొందవచ్చు. వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. 

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ధైర్యంగా కర్తవ్యాన్ని నిర్వహించండి. పెద్దల సహకారం లభిస్తుంది. అధికార యోగం ఉంటుంది. విఘ్నాలను అధిగమించి లక్ష్యాన్ని చేరుకుంటారు. విశేష ధన యోగాలు ఉంటాయి. అదృష్టవంతులు అవుతారు. వచ్చిన ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవాలి. 

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

ఉద్యోగంలో ప్రశంసలు పొందుతారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల సహకారంతో లక్ష్యాన్ని చేపడుతారు. సౌమ్యంగా సంభాషించాలి.

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయండి. కాలం చాలా వ్యతిరేకంగా ఉంటుంది. ధర్మ మార్గంలో నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం ఉత్తమం. ఆత్మీయుల సలహాలు మేలు చేకూరుస్తాయి. ఉద్యోగంలో జాగ్రత్త వహించడం ఉత్తమం. ఇబ్బంది కలిగించే వారు ఉంటారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రయత్నించాలి. 

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

పట్టుదలతో చేసే పనుల్లో విజయం ఉంటుంది. అనుకున్న మార్గంలో ముందుకు సాగడం ఉత్తమం. కాలం చాలా వ్యతిరేకంగా ఉంది. దేనికీ భయపడవద్దు. తొందరపాటు అస్సలు వద్దు. ఎవరేమనుకున్నా మనస్సుకు తీసుకోవద్దు. ఆర్థిక నష్టాలు రాకుండా ప్రణాళికతో పని చేయండి. ముఖ్యమైన కార్యక్రమాలను కొంతకాలం వాయిదా వేయండి. కొత్త పనులను ప్రారంభించకూడదు.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

దృష్టవంతులు అవుతారు. ఉద్యోగంలో మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. స్థిరమైన ఫలితాలు కలుగుతాయి. తోటివారి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. వ్యాపారం కలిసి వస్తుంది. ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు. 

Visitors Are Also Reading