Home » రానా కారణంగా త్రిష, ప్రభాస్ పెళ్లి క్యాన్సిల్ అయిందా ?

రానా కారణంగా త్రిష, ప్రభాస్ పెళ్లి క్యాన్సిల్ అయిందా ?

by Bunty
Ad

టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రభాస్ ఎప్పటికప్పుడు సినిమాలు చేస్తూ ప్రేక్షకులని మెప్పిస్తూ ఉంటాడు. తన నటనతో ఎంతోమంది ప్రేక్షకుల మనసులను దోచుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ పెళ్లికి సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది.

Advertisement

తాను వివాహం చేసుకోవడానికి సిద్ధమైనట్టు వార్తలు వచ్చినప్పటికీ ఆ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రభాస్ కూడా ఓ సందర్భంలో నేను వివాహం చేసుకుంటానని చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ ప్రభాస్ కి 40పదుల వయసు దాటినప్పటికీ ఇంకా వివాహం చేసుకోలేదు. అయితే ప్రభాస్ సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఓ స్టార్ హీరోయిన్ చేతిలో మోసపోయాడనే వార్త వైరల్ గా మారింది. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు త్రిష. చెన్నై బ్యూటీగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న త్రిష ప్రభాస్ తో కలిసి దాదాపు మూడు సినిమాల్లో నటించింది.

Advertisement

వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి ఒక్క సినిమా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. వర్షం సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధమయ్యారట. కానీ త్రిష అప్పటికే హీరో రానా దగ్గుబాటిని కూడా ప్రేమిస్తుందనే వార్త బయటకు వచ్చిందట. దీంతో ఆ మోసాన్ని తట్టుకోలేక ప్రభాస్ తీవ్రంగా బాధపడ్డారట. ఇక ఆ విషయం తెలిసి ప్రభాస్ త్రిషని దూరం పెట్టాడట. ఆ మోసాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేక ప్రభాస్ పెళ్లికి చాలా దూరంగా ఉన్నాడని ఇండస్ట్రీవర్గాల సమాచారం.

ఇవి కూడా చదవండి

Visitors Are Also Reading