Home » వడ్డే నవీన్ చేసిన ఆ తప్పు వల్లే నందమూరి ఫ్యామిలీ తొక్కేసిందా.. అసలు కారణం ఏంటంటే..?

వడ్డే నవీన్ చేసిన ఆ తప్పు వల్లే నందమూరి ఫ్యామిలీ తొక్కేసిందా.. అసలు కారణం ఏంటంటే..?

by Anji
Ad

సాధారణంగా సినీ ఇంస్ట్రీలో ఓ మంచి హీరోగా ఎదగుదామని ఇండస్ట్రీకి వచ్చి.. కొద్ది రోజుల పాటు హీరోగా సక్సెస్ సాధించిన తరువాత చాలా ఫ్లాప్ లను ఎదుర్కొని ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న హీరోల్లో వడ్డె నవీన్ ఒకరు. నవీన్ తండ్రి వడ్డె రమేష్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాత కావంతో ఈయన చేసిన సినిమాలు ప్రారంభంలో మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ వరుస ఫ్లాప్ లు రావడంతో ఇండస్ట్రీలో ఎక్కువకాలం కొనసాగలేకపోయాడు. 

Advertisement

నవీన్ వాళ్ల నాన్న రమేష్ అగ్ర నిర్మాత కావడంతో ఆయన చాలా వరకు ఎన్టీఆర్ గారితోనే సినిమాలు తీసేది. దాసరినారాయణరావుతో ఎక్కువగా సినిమాలు చేసి ఉండటంతో వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యంతో ఎన్టీఆర్ పెద్ద కుమార్తె లోకేశ్వరి కూతురు ఛాముండేశ్వరిని నవీన్ కి ఇచ్చి వివాహం చేద్దామని దాసరి గారితో ఎన్టీఆర్ ని అడిగించారు. ఎన్టీఆర్ బతికి ఉన్నప్పుడే ఆయనతో మాట్లాడారు. ఆయన ఓకే అన్నారు. అకస్మాత్తుగా అనుకోకుండా మరణించారు. దీంతో ఆయనకు ఇచ్చిన మాట ప్రకారమే వీరికి పెళ్లి జరిగింది. నందమూరి ఫ్యామిలీకి రిలేటివ్ అవ్వడంతో నవీన్ కి అప్పట్లో చాలా సినిమాల ఆఫర్లు లభించాయి.

Advertisement

అలా ఆయన సినిమా చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో హీరోయిన్ మహేశ్వరితో ఆయనకి సాన్నిహిత్యం ఏర్పడటం ఆమెతో ఎక్కువ సినిమాలు చేయడం ఆ తరువాత వీరిద్దరూ రిలేషన్ లో ఉంటున్నారనే విషయం తెలిసి ఛాముండేశ్వరి నవీన్ నుంచి విడాకులు తీసుకుని సపరేట్ అయిపోయింది. అప్పటి నుంచి నవీన్ నందమూరి ఫ్యామిలీకి కాస్త దూరమయ్యాడు. నవీన్ హీరోగా చేస్తున్న సినిమాలన్నింటిని నందమూరి ఫ్యామిలీ వాళ్ల పలుకుబితో ఆ సినిమాలో నుంచి నవీన్ ని హీరోగా తీసేయించి వేరే వాళ్లను పెట్టుకొని సినిమాలు చేసేలా చేశారట. దీంతో నవీన్ కెరీర్ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. ఈ మధ్య వర్మ తీసిన ఎటాక్ మూవీ ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినప్పటికీ పెద్దగా వర్కవుట్ అవ్వకపోవడంతో ఆయనకు అసలు ఏవిధమైన పేరు రాలేదు. దీంతో ఆయన కంప్లీట్ గా సినిమాలకు దూరమయ్యాడు. 

మరికొన్ని సినిమా వార్తలు ఇక్కడ మనం చూద్దాం.

Visitors Are Also Reading