Home » వైజయంతీ మూవీస్ వార్నింగ్.. ‘మెగా 157’ నిలిచిపోయినట్టేనా..?

వైజయంతీ మూవీస్ వార్నింగ్.. ‘మెగా 157’ నిలిచిపోయినట్టేనా..?

by Anji
Ad

సాధారణంగా సినీ ఇండస్ట్రీకి ఇప్పుడు  కొత్త కథలు కావాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.  ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తం కొత్త కథలు కావాలనే తిరుగుతున్నారు. ఎక్కడి నుంచి వస్తాయి కొత్త కథలు. ఎంత కొత్తగా ఆలోచించినా ఏదో ఒక సినిమా. అలాంటి కథనే బేస్ చేసుకుని ఉంటుంది. అందుకే చాలా మంది దర్శకులు.. పాత కథలను తిమ్మినిబమ్మిని చేసి కొత్త కథగా తీర్చిదిద్దేస్తున్నారు. లేకపోతే సేఫ్ గా రీమిక్స్ అని చెప్పేస్తున్నారు. మరి కొంతమంది అయితే.. హిట్ అయిన సినిమాకు సీక్వెల్ అని ఫ్రీక్వెల్ అని చెప్పుకొస్తున్నారు.

Advertisement

ఏది ఏమైనా ఒక కథను కొత్తగా చూపిస్తున్నామని పాత సినిమాలనే రీ క్రియేట్ చేస్తున్నారు. ఒకప్పుడు హిట్ అందుకున్నా సినిమాలకు సంబంధించిన ఒక లైన్ తీసుకొని తమకు నచ్చిన విధంగా మార్చుకొని హిట్ కొట్టిన డైరెక్టర్స్ ఎంతోమంది ఇక ఇవన్నీ ఇప్పుడెందుకు వచ్చాయంటే బింబిసారా సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ వశిష్ట. మొదటి సినిమా పీరియాడిక్ డ్రామా తెరకెక్కించడమే గొప్ప అనుకుంటే హిట్ అందుకొని మెగాస్టార్ కంట్లో పడడం మరింత గొప్ప అని చెప్పాలి. ఇంక రెండో  సినిమానే మెగాస్టార్ చిరంజీవితో మెగా 157 మొదలు పెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. పంచభూతాలను కలిపిన కథతో వశిష్ట రానున్నాడని తెలుస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ కుర్ర డైరెక్టర్ జగదేకవీరుడు అతిలోక సుందరి కథ ఆధారంగా కొన్ని సీన్స్ రాసుకున్నాడని సమాచారం.

Advertisement

అంతేకాకుండా అందులోని కొన్ని సీన్స్ ను రీ క్రియేట్ చేసే ఉద్దేశంలో ఉన్నాడని తెలుస్తోంది. దీంతో జగదేకవీరుడు అతిలోకసుందరి నిర్మాతలు ముందుగానే వార్నింగ్ ఇచ్చారని నెటిజెన్స్ చెప్పుకొస్తున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి కు సీక్వెల్ కానీ, ఫ్రీక్వెల్ కానీ ,సీన్స్ రీ క్రియేట్ చేయడం కానీ, కనీసం ఆ కథ ఆధారంగా మరో కథను రాసుకోవడానికి కూడా వీల్లేదని, అలా చేస్తే లీగల్ చర్యలు తప్పవు అని చెప్పుకొచ్చారు. అయితే వైజయంతి మూవీస్ ఇచ్చిన వార్నింగ్ మెగా 157 కే అని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ సినిమా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ కంటెంట్ ని అనధికారికంగా ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ వైజయంతీ మూవీస్ ప్రకటించడం సంచలనంగా మారింది. అయితే మెగా 157 వైజయంతీ మూవీస్ వద్ద అనుమతి తీసుకొని ముందుకెళ్తుందో లేక ప్రాజెక్ట్ కి బ్రేకులు పడుతాయో వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

 వెండితెర మాంత్రికుడు.. ఓటమి ఎరుగని దర్శక ధీరుడు..!

అల్లు అర్జున్ భార్య పట్ల అలా వ్యవహరిస్తున్నాడా..? ఆ విషయంలో భార్య కోరిక తీర్చలేక..!

 

Visitors Are Also Reading