Home » వినాయ‌క చ‌వితి రోజు ఈ 5 ప్ర‌సిద్ధి దేవాల‌యాల‌ను ద‌ర్శించుకుంటే అంతా శుభ‌మే..!

వినాయ‌క చ‌వితి రోజు ఈ 5 ప్ర‌సిద్ధి దేవాల‌యాల‌ను ద‌ర్శించుకుంటే అంతా శుభ‌మే..!

by Anji
Ad

మ‌న జీవన విధానంలో మనం చేసే కొన్ని శుభకార్యాలు, కొన్ని పనుల్లో ఎలాంటి ఆపదలు, ఆటంకాలు రాకుండా అంతా మంచే జరగాలని ఆ గణేషుని ఆరాధిస్తుంటారు. ఇక గ‌ణేషుని పుట్టినరోజు సంద‌ర్భంగా న‌వ‌రాత్రి ఉత్స‌వాలు ఎంతో అంగ‌రంగ వైభ‌వంగా సంబురంగా జరుపుకుంటారు. కేవ‌లం మ‌న భార‌త‌దేశంలోనే ఈ గ‌ణేషు ఉత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి. ముఖ్యంగా శ్రావణమాసం ముగిసిన త‌రువాత తదుపరి వినాయక చవితి పండుగ అనేది సహజంగా ఆగస్టు లేక సెప్టెంబర్ లో ఈ పండుగ వస్తుంది. ఈ ఏడాది ఆగ‌స్టు 31న ఈ వినాయక చవితి. వినాయ‌క చ‌వితి త‌దుప‌రి చ‌తుర్ద‌శి నాడు ముగుస్తుంది. వినాయ‌క చ‌వితి చివ‌రి రోజున గ‌ణేష్ నిమ‌జ్జ‌నం ఘ‌నంగా జ‌రుపుకుంటారు. 2022 ఏడాది గ‌ణేష్ నిమ‌జ్జ‌నం సెప్టెంబ‌ర్ 09న జ‌రుగ‌నుంది. వినాయ‌క చ‌వితి రోజు మ‌న భార‌త‌దేశంలో ఉన్న ప్ర‌సిద్ధి గ‌ణేష్‌ని ఆల‌యాలు ఎక్క‌డున్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

చెన్నై వ‌ర‌సిద్ధి వినాయ‌క గుడి :

త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలోని బీసెంట్ సిటీలో ఉన్న ఐకానిక్ గ‌ణేషుని దేవాల‌యం. ప్ర‌తీ సంవ‌త్స‌రం వినాయ‌క చ‌వితి రోజు గొప్ప వేడుక‌లు జ‌రుపుకుంటారు. ఈ దేవాల‌యం సంగీత కార్య‌క్ర‌మాల‌ను, సామాజిక కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తోంది.

కేర‌ళ- కాల‌మ‌స్పేరి మ‌హాగ‌ణ‌ప‌తి ఆల‌యం : 

ఈ దేవాలయంలో సుబ్రహ్మణ్యం, గణేశుడు,నవగ్రహాలు,రాముడు, శివ,పార్వతి లాంటి ఇతర హిందూ దేవతలు కూడా ఉంటారు. ఈ ఆల‌యంలో 1980లో కలమస్పేరి ఎన్ రఘునాథ మీనన్ నిర్మించారు. ఇక్కడ గత పూజ ప్రతి నాలుగు సంవ‌త్స‌రాల‌కు ఒకసారి జరుగుతుంది. భక్తులు ఏనుగులను గణేషుడి అవతారంగా పిలుచుకుంటారు.

ముంబై – సిద్ధి వినాయక ఆలయం:

Advertisement

భార‌త ఆర్థిక రాజ‌ధాని అయిన‌టువంటి ముంబైలోని ఎంతో ముఖ్యమైన ఆలయం గణేష్ ఆలయం. ఇక్క‌డ సామాన్యులతో పాటు ప్రముఖులు, సెలబ్రిటీలు ఈ దేవాలయాన్ని దర్శనానికి వస్తుంటారు. ఇక్కడ‌ దేవుడిని నవచాచా గణపతి అని కూడా పిలుస్తుంటారు.

ఇవి కూడా చ‌ద‌వండి :  “ఆదిత్య 369” టైటిల్ లో 369 నంబ‌ర్ ఎందుకు పెట్టారో తెలుసా..? ఆ నంబ‌ర్ అర్థం ఏంటంటే..?

పూణే- ద‌గ్దు షేత్ హ‌ల్వాయి గ‌ణ‌ప‌తి ఆల‌యం :

పూణేలో ఉన్న‌టువంటి ద‌గ్దు ఆల‌యం ఇది 130 సంవ‌త్స‌రాల నాటిది. ద‌గ్దు హేత్ హ‌ల్వాయి గ‌ణ‌ప‌తి ఆల‌యం. వేలాది మంది ఈ స్వామివారిని సందర్శించుకుంటారు. చరిత్ర విధానంగా నందుగావక్ కు చెందిన వ్యాపారి స్వీట్ మేకర్ శ్రీమంత్ దగ్దు షేత్ హల్వాయి, తన భార్య లక్ష్మీబాయి పూణేలో స్థిరపడ్డారు. ఈ స్వీట్ షాప్ యజమాని దగ్దు సేత్ ఆరోజు ప్లేగు వ్యాధితో చనిపోయిన తన కొడుకు జ్ఞాపకంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రతి ఏడాది గణపతి ఉత్సావాల‌ను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.

ఇవి కూడా చ‌ద‌వండి :  శిఖర్ ధావన్ కు రానున్న పూర్తి కెప్టెన్సీ..!

జైపూర్ మోతి దుండ్రి గ‌ణేష్ దేవాల‌యం :

ఈ దేవాల‌యాన్ని 1761 లో నిర్మించారు. ఇక ఈ ఆలయానికి దాదాపు 250 సంవత్సరాలు పైగా చరిత్ర ఉంది. కొండలు, కోటలతో చుట్టుముట్టబడి జైపూర్ పురాతన ఆలయంలో గ‌ణేష్‌ని దేవాల‌యం ఒకటి. ఇక్క‌డి గణేష్ విగ్రహం దాదాపు 500 సంవత్సరాల నాటిది. ఈ విగ్రహాన్ని ఉదయపూర్ నుంచి తీసుకొచ్చార‌ని.. ఈ దేవాలయంలో శివలింగం కూడా ఉంటుంది. మహాశివరాత్రి రోజు అధిక‌ సంఖ్యలో భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. ఈ ఆలయంలో గణేశుడు సింధూర రంగులో ఉండి తొండం కుడివైపు ఉండ‌డం విశేషం.

ఇవి కూడా చ‌ద‌వండి :  అల్లంతో అన్‌వాంటేడ్ హెయిర్‌ని తొల‌గించ‌వ‌చ్చు.. ఎలాగో తెలుసా..?

Visitors Are Also Reading