Home » “ఆదిత్య 369” టైటిల్ లో 369 నంబ‌ర్ ఎందుకు పెట్టారో తెలుసా..? ఆ నంబ‌ర్ అర్థం ఏంటంటే..?

“ఆదిత్య 369” టైటిల్ లో 369 నంబ‌ర్ ఎందుకు పెట్టారో తెలుసా..? ఆ నంబ‌ర్ అర్థం ఏంటంటే..?

by AJAY

నటసింహం నందమూరి బాలకృష్ణ ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. బాలయ్య కేవలం ఒకేరకమైన సినిమాల్లో నటించకుండా అన్ని రకాల పాత్రల్లో నటించాడు. ప్రయోగాత్మక సినిమాల్లో నటించి మెప్పించారు. పౌరాణిక పాత్రలోనూ బాలయ్య అదరగొట్టారు. బాలయ్య కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలలో ఆదిత్య 369 కూడా ఒకటి. ఈ సినిమా అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో బాలకృష్ణ నట విశ్వరూపం చూపించారు.

ఇవి కూడా చదవండి: చిరంజీవి న‌టించిన సినిమాల్లో బాల‌య్య‌కు చాలా ఇష్ట‌మైన ఒకే ఒక్క సినిమా ఏదో తెలుసా..?

ఈ సినిమా బాలయ్య కెరీర్ ను నిలబెట్టింది. ఈ చిత్రం టైం మిషన్ అనే డిఫరెంట్ కన్స్పెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా టైటిల్ లో 369 అనే నంబర్ ఎందుకు ఉందో ఎవరికి అర్థం కాలేదు. ఓ ఇంటర్వ్యూ లో బాలయ్య కు కూడా ఈ సినిమా టైటిల్ విషయంలో ఓ ప్రశ్న ఎదురైంది. దాంతో బాలయ్య ఆదిత్య అంటే సూర్యుడు అని సమాధానం ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి: “లైగ‌ర్” సినిమాను మిస్ చేసుకున్న ముగ్గురు టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా.? ఎందుకు రిజెక్ట్ చేశారంటే.?

అంతే కాకుండా 369 అంటే అదొక స్పెషల్ నంబర్ అని చెప్పాడు. కానీ ఆ నంబర్ ఎలా వచ్చింది ….దాని అర్థం ఏంటి అన్నది చెప్పలేదు. అయితే 369 అనే నంబర్ వెనక కూడా ఒక ఆసక్తికర విషయం ఉంది. 369 అంటే పాజిటివిటి అనే అర్థం వస్తుంది. అందులో 3 అంటే మార్పు అని అర్థం….6 అంటే కొత్త ఆరభం అని అర్థం వస్తుంది. అదే విధంగా 9 అంటే విస్తరించడం అనే అర్థం వస్తుంది.

అదే విధంగా 369 అనే నంబర్ గడియారం లో సరి సమానంగా ఉండే కాలాన్ని సూచిస్తుంది. సంఖ్యా శాస్త్రం ప్రకారం కూడా ఈ నంబర్ చాలా లక్కీ అని నిపుణులు చెబుతున్నారు. మ‌రోవైపు స‌ల్మాన్ ఖాన్ కు కూడా ఇదే నంబ‌ర్ లక్కీ నంబ‌ర్ కావ‌డం విశేషం. స‌ల్మాన్ కార్ నంబ‌ర్ తో పాటూ ఇదే నంబ‌ర్ ను ఉప‌యోగిస్తారట‌. ఈ నంబ‌ర్ స‌ల్మాన్ ఖాన్ కు చాలా ల‌క్కీ అట‌. స‌ల్మాన్ ఖాన్ పుట్టిన తేదీతో ఈ నంబ‌ర్ కు ఓ లింక్ కూడా ఉంద‌ట‌.

ఇవి కూడా చదవండి: జ‌బ‌ర్ద‌స్త్‌, శ్రీ‌దేవి డ్రామా కంపెనీలో చేసే అన్న‌పూర్ణ‌మ్మ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

Visitors Are Also Reading