Home » ఓటీటీలో వినరో భాగ్యము విష్ణు కథ స్ట్రీమింగ్ ఎప్పుడు ? ఎక్కడ అంటే..? 

ఓటీటీలో వినరో భాగ్యము విష్ణు కథ స్ట్రీమింగ్ ఎప్పుడు ? ఎక్కడ అంటే..? 

by Anji
Ad

కుర్ర హీరో కిరణ్ అబ్బవరం ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల ఓ ఇంట్రెస్టింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ సినిమానే వినరో భాగ్యము విష్ణు కథ. ఈ చిత్రానికి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించారు. భలే భలే మగాడివోయ్, గీత గోవిందం టాక్సీవాలా, ప్రతిరోజు పండుగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, 18 పేజేస్ వంటి అద్భుతమైన చిత్రాల తరువాత జీఏ2 పిక్చర్స్ బ్యానర్ లో వచ్చింది వినరో భాగ్యం విష్ణు కథ. 

Also Read :  RRR ఆస్కార్ కొనేసిందని బాలీవుడ్ సెలెబ్రిటీ ట్వీట్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?

Advertisement

ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం సరసన కశ్మీర పర్దేశీ నటించింది. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మంచి టాక్ సంపాదించుకుంది. ఈ సినిమా ఉగాది కానుకగా ఓటీటీలో అలరించడానికి సిద్ధం అయింది. వినోరో భాగ్యము విష్ణు కథ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఉగాది పండుగ సందర్భంగా మార్చి 22వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నది ఆహా. 

Advertisement

Also Read :   ఓటీటీలోకి పంచతంత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Manam News

మురళీ శర్మ కామెడీ.. చైతన్ భరద్వాజ్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్స్ అని చెప్పవచ్చు. వినరో భాగ్యము విష్ణు కథ సినిమా విషయానికొస్తే.. తిరుమల తిరుపతి నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రంతో మురళి కిషోర్ అబ్బురు దర్శకునిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ చిత్రంలోని పాటలన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి. ఇదివరకే కిరణ్ కి ఎస్ ఆర్ కళ్యాణమండపం చిత్రానికి మంచి సాంగ్స్ రాసిన భాస్కర భట్ల ఈ చిత్రంలో కూడా అదే స్థాయిలో పాటలను రచించారు.  

Also Read :  RRR చిత్ర యూనిట్ గురించి నిర్మాత డీవీవీ దానయ్య సంచలన వ్యాఖ్యలు.. అందుకోసమేనా ?

Visitors Are Also Reading