Home » RRR ఆస్కార్ కొనేసిందని బాలీవుడ్ సెలెబ్రిటీ ట్వీట్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?

RRR ఆస్కార్ కొనేసిందని బాలీవుడ్ సెలెబ్రిటీ ట్వీట్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..?

by Anji
Ad

‘RRR’ సినిమాలోని నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అవార్డు రావడమేమో గానీ ప్రతీ ఒక్కరూ ఆ మాయలో పడి ఊగిపోతున్నారు. మన సినిమా, మన పాట ఆస్కార్ అవార్డు వచ్చిందని గర్వంగా చెప్పుకొంటున్నారు.

Advertisement

ఇదే సమయంలో కొందరూ మాత్రం తమ ఈర్ష్యని బయటపెడుతున్నారు. తెలుగు సినిమాకి ఈ రేంజ్ లో క్రేజీ దక్కడం చూసి భరించలేకపోతున్నారు. కొందరూ చిల్లర కామెంట్స్ చేస్తున్నారు. ఇలా చేస్తే.. నెటిజన్లు మాత్రం ఊరుకుంటారా ? మరీ. తాజాగా ఓ బాలీవుడ్ సెలబ్రిటీ విషయంలో కూడా ఇదే జరిగింది. 

Also Read :  పవిత్ర లోకేష్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటో మీకు తెలుసా..?

RRR Oscor

వివరాల్లోకి వెళ్లితే.. RRR చిత్రం గత ఏడాది థియేటర్లలో విడుదల అయింది. తెలుగు వారని ఎంతగానో ఆకట్టుకున్న ఈ సినిమా హాలీవుడ్ సెలబ్రిటీలను సైతం మెప్పించింది. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ వంటి పెద్ద దర్శకులు రాజమౌళి సినిమాని తెగ మెచ్చుకున్నారు. RRR టీమ్ ఎంతో కష్టపడి తమ సినిమాలోని పాటకు ఆస్కార్ అవార్డు సాధించింది. ఈ నేపథ్యంలోనే కొందరూ సాధారణ నెటిజన్లు మాత్రం డబ్బులను ఇచ్చి కొనుక్కున్నారని.. కామెంట్స్ చేస్తున్నారు. వీరిని ఎవ్వరూ పెద్దగా పట్టించుకోరు. కానీ బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫ్రెండ్ అయిన షాన్ మట్టతిన్ మాత్రం ఓ పోస్ట్ కింద షాకింగ్ కామెంట్స్ చేశాడు.  

Advertisement

Also Read :  JR:ఎన్టీఆర్ ఎదుగుదలను ఓర్వలేకపోతున్న బాలయ్య.. కారణమేంటంటే..?

హ, హ ఇది చాలా ఫన్నీ.. ఇప్పటివరకు భారతదేశంలో మాత్రమే అవార్డులను కొనుక్కోవచ్చని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఆస్కార్స్ లో కూడా అలాగే.. డబ్బులుంటే ఆస్కార్ అవార్డును కూడా కొనేయవచ్చు Lol అని షాన్ కామెంట్ చేసాడు. దీనిపై నెటిజన్లు రెచ్చిపోతూ.. మీరు యాక్టింగ్ నేర్చుకోండి. ఆ తరువాత అవార్డుల గురించి ఆలోచిస్తారులే అని రెచ్చిపోతారు. బాలీవుడ్ లో మాత్రమే అవార్డులను డబ్బులు ఇచ్చి కొంటారని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది అయితేనేం అందరూ RRR గురించి పాజిటివ్ గా మాట్లాడుతుంటే.. ఇతను మాత్రం కోరి కామెంట్ చేసి కష్టాలను కొని తెచ్చుకున్నట్టు కనిపిస్తోంది. 

Also Read :  సమంతను నాగచైతన్య అంతలా టార్చర్ చేశారా ? ఆ ట్వీట్ వైరల్..!

Visitors Are Also Reading