Home » దేవుడి ఉంగరాలు పెట్టుకుంటున్నారా… అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..?

దేవుడి ఉంగరాలు పెట్టుకుంటున్నారా… అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..?

by Bunty
Published: Last Updated on
Ad

సాధారణంగా వేళ్ళకు ఉంగరాలు ఎంతో అందాన్ని తెచ్చిపెడతాయి. కొంతమంది ఎంతో ఇష్టంగా ఉంగరాన్ని వేళ్లకు ధరిస్తుంటారు. మరి కొంతమంది వారి జాతకరీత్యా వారి ఇష్ట దైవానికి అనుగుణంగా దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరిస్తారు. అయితే సాధారణంగా దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించేటప్పుడు దేవుడి తల ఎటువైపు ఉండాలి. కాళ్లు ఎటువైపు ఉండేలా ధరించాలి అని చాలామందికి సందేహం ఉంటుంది.

Advertisement

 

అలాంటి సమయంలో దేవుడి కాళ్లు మనికట్టు వైపు, దేవుడి తల వేళ్ళ గోర్ల వైపు ఉండేలా ఉంగరం ధరించాలి. ఇలా ధరించడానికి ఒక కారణం ఉంది. ఎందుకంటే మన చేతి వేళ్ళు ఎప్పుడు భూమిని చూస్తూ ఉంటాయి. కాబట్టి ఉంగరాన్ని అలా ధరించాలి. అలాగే దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించేటప్పుడు ఉదయం లేవగానే వాటిని కళ్ళకు అద్దుకుంటారు. అలాంటి సమయంలో మన చేతిని ముడిచి ఉంగరాన్ని కళ్ళకు అద్దుకోవాలి.

Advertisement

అలాగే మహిళలు ఇలాంటి ఉంగరాలను ధరించినప్పుడు నెలసరి సమయంలో వారిని తీసి పక్కన పెట్టాలి. అలాగే మాంసాహారం తింటున్న సమయంలో కూడా ఇలా దేవుడి ప్రతిమ ఉంగరాలను ధరించకూడదు. ఇలా దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలను ధరించడమే కాకుండా మెడలో కూడా దేవుడి ప్రతిమ ఉన్న లాకెట్లు దరిస్తూ ఉంటారు. వారు కూడా ఇలాంటి మాంసం మద్యపానం సేవించకూడదు. ఇక మహిళలు కూడా నెలసరి సమయంలో దేవుడి ప్రతిమ ఉన్న ఉంగరాలు లాకెట్టు తీసి పక్కన పెట్టాలి.

READ ALSO : Shardul Thakur : మిథాలీని పెళ్లి చేసుకున్న శార్దూల్ ఠాకూర్.. ఫోటోలు వైరల్!

Visitors Are Also Reading