Home » virataparvam first review:విరాట పర్వం సినిమా మొదటి రివ్యూ..ఎలా ఉందంటే..?

virataparvam first review:విరాట పర్వం సినిమా మొదటి రివ్యూ..ఎలా ఉందంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

గత కొద్ది రోజుల నుంచి ట్రైలర్ మరియు పాటలతో అదరగొడుతూ వస్తున్న సినిమా విరాటపర్వం. ఈ మూవీపై ఇప్పటికే ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి. అయితే మూవీ వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలో హీరోగా రానా ప్రత్యేకమైన పాత్రలో మనకు కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఆయన చాలా కాలం తర్వాత హీరోగా విరాటపర్వం ద్వారా మన ముందుకు వస్తున్నారు. అయితే ఈ మూవీ ఈనెల 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ మీద దగ్గుబాటి సురేష్ బాబు నిర్మించారు. అయితే ఆయన నిర్మించినటువంటి దృశ్యం పార్ట్ 2, నారప్ప వంటి సినిమాలు ఓటిటీ లోనే విడుదలయ్యాయి.

కానీ విరాటపర్వం ఇప్పటికే అభిమానుల్లో ఎన్నో అంచనాలు పెంచుకొని దూసుకు వస్తోంది. ఈ మూవీ గత సంవత్సరం ఏప్రిల్ 17 తేదీన విడుదల కావాల్సి ఉండగా కరోణ కేసులు పెరిగినందున వాయిదా పడుతూ వచ్చింది. అయితే మూవీని డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేయడం కోసం అనేక ఆఫర్లు కూడా వచ్చాయి. అయితే ఈ మూవీ బాక్సాపీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తుందని సురేష్ బాబుకు గట్టి నమ్మకం ఉన్నది. అందుకే ఈ మూవీని థియేటర్లో విడుదల చేయాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇటీవల ఈ మూవీని కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలు స్పెషల్ స్క్రీనింగ్ చేశారు. మరి మూవీ విశేషాలు ఎలా ఉన్నాయో మనం కూడా చూద్దాం..? మూవీ కథ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో 1990 లో నక్సలైట్ల ఉద్యమాన్ని బేస్ చేసుకొని దర్శకుడు వేణు ఊడుగుల సినిమాను తెరకెక్కించారు. ఇందులో సాయి పల్లవి మరియు రానా నక్సలైట్లు గా కనిపించనున్నారు.

Advertisement

Advertisement

ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన ఎమోషన్స్ ని భావోద్వేగాలను డైరెక్టర్ వేణు ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో సాయి పల్లవి నటన మాత్రం ప్రేక్షకుల అంచనాలకు అందకుండా ఉందని తెలుస్తోంది. మూవీ చూసిన ప్రతి ఒక్కరు కంటతడి పెట్టడం ఖాయమని అంటున్నారు. ఈ సినిమా పతాక సన్నివేశంలో హీరోయిన్ మరియు హీరో మరణిస్తారట. ఈ సన్నివేశాన్ని వేణు ఉడుగుల చాలా అద్భుతంగా చిత్రీకరించారని సమాచారం. అయితే రానా నేనే రాజు నేనే మంత్రి తర్వాత పూర్తిస్థాయి హీరోగా నటించిన ఈ చిత్రం తన సినీ కెరీర్ లోనే ఒక చరిత్రల మిగిలిపోతుందని అంటున్నారు. ఈ సినిమా చూసిన కొంత మంది స్టార్లు మూవీ గురించి సోషల్ మీడియాలో పెట్టే పోస్టర్లు చూస్తుంటే మాత్రం అభిమానులకు మరింత ఆసక్తి పెరుగుతోంది. డిజే టిల్లు హీరో సిద్ధూ ఈ మూవీ గురించి ట్విట్ చేయడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నెల 17న రిలీజ్ కానున్న ఈ మూవీ ఎలాంటి రికార్డు సొంతం చేసుకుంటుందో వేచి చూడాలి.

also read;

అల్లు శిరీష్ బన్నీలా స్టార్ హీరో అవ్వలేకపోవడానికి 5 కారణాలు ఇవేనా!

సార్ నా భార్యను అరెస్ట్ చేయండి.. పోలీస్ స్టేషన్ ముందు నిరసన.. కారణం ఏమిటంటే?

 

 

Visitors Are Also Reading