Home » అల్లు శిరీష్ బన్నీలా స్టార్ హీరో అవ్వలేకపోవడానికి 5 కారణాలు ఇవేనా!

అల్లు శిరీష్ బన్నీలా స్టార్ హీరో అవ్వలేకపోవడానికి 5 కారణాలు ఇవేనా!

by AJAY
Ad

చిత్ర‌ప‌రిశ్ర‌మ రంగుల ప్ర‌పంచం అందులో విహ‌రించాల‌ని చాలా మందికి ఉంటుంది. అయితే అంద‌రికీ అవ‌కాశం సులభంగా దొర‌క‌దు. కానీ సినిమా కుటుంబంలో పుట్టిన‌వారికి మాత్రం పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. అయితే ఆ వార‌సత్వం ఒక‌టి రెండు సినిమాల వ‌ర‌కే ప‌నిచేస్తుంది ఆ త‌ర‌వాత త‌మ‌ను తాము నిరూపించుకోలేక‌పోతే స‌క్సెస్ అవ్వ‌లేరు. ఇక ప్ర‌స్తుతం అల్లు శిరీష్ ప‌రిస్థితి కూడా అలాగే ఉంది. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కుమారుడు..ఓ అన్న నిర్మాత అయితే మ‌రో అన్న అల్లు అర్జున్ స్టార్ హీరో కానీ శిరీష్ మాత్రం ఇండ‌స్ట్రీలో స‌రైన స‌క్సెస్ ను అందుకోలేక‌పోతున్నాడు.

Advertisement

అయితే శిరీష్ స్టార్ గా ఎద‌గ‌క‌పోవ‌డానికి కొన్ని కార‌ణాలు ఉన్నాయి. అల్లు అర్జున్ తన మొద‌టి సినిమాను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వంలో చేశాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ త‌ర‌వాత ఆర్య‌, దేశ‌ముదురు లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ లు అందుకున్నాడు. రీసెంట్ గా పుష్ప‌తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. శిరీష్ విష‌యానికి వ‌స్తే ప్ర‌స్థానం సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయ్యాడు. ఈ సినిమా ద‌ర్శ‌కుడికి అంత‌కు ముందు పెద్ద‌గా హిట్స్ లేవు.

Advertisement

అంతే కాకుండా మొద‌టి సినిమానే ప్ర‌యోగాత్మ‌క చిత్రంలో న‌టించాడు. ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు చాలా బోరింగ్ గా అనిపించింది. అంతే కాకుండా బ‌న్నీ న‌ట‌న ప్రేక్ష‌కుల‌కు న‌చ్చింది కానీ శిరీష్ కు అస‌లు న‌ట‌న రాద‌ని…ఫేస్ లో ఎక్స్పెష‌న్స్ ప‌ల‌క‌లు అనే అభిప్రాయానికి ప్రేక్ష‌కులు వ‌చ్చారు. మ‌రోవైపు అల్లు అర్జున్ డ్యాన్స్ ఇర‌గ‌దీస్తాడు. కానీ శిరీష్ డ్యాన్స్ లోనూ నిరూపించుకోలేక‌పోయాడు.

ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే ఎంత‌టి బ్యాగ్రౌండ్ ఉన్నా కూడా హీరోల‌కు ఓపిక కూడా ఉండాలి. బ‌న్నీ ఒక్క సీన్ చ‌క్క‌గా రావ‌డానికి తెగ‌క‌ష్ట‌ప‌డ‌తాడ‌ట‌. కానీ శిరీష్ కు మాత్రం చాలా ఓపిక తక్కువ అని అందువ‌ల్లే పెద్ద ద‌ర్శ‌కులు ఆయ‌నను సంప్ర‌దించ‌రు అని ఇండ‌స్ట్రీలో ఓ టాక్ కూడా ఉంది. ఇక మొత్తంగా చూసుకుంటే శిరీష్ కెరీర్ లో శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు తప్ప చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. మ‌రి శిరీష్ ఫ్యూచ‌ర్ లో అయినా స్టార్ హీరోగా ఎదుగుతాడో లేదో చూడాలి.

AlSO READ : బాలయ్య నో చెప్పిన కథతో మోహన్ బాబు హిట్ కొట్టిన సినిమా ఏదో తెలుసా..?

Visitors Are Also Reading