Home » విరాట్ కోహ్లీ ఇండియా జట్టులో ఉంటాడా.. లేదా…?

విరాట్ కోహ్లీ ఇండియా జట్టులో ఉంటాడా.. లేదా…?

by Azhar
Ad

భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గత కొన్ని నెలలుగా పరుగులు చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అది ఈ ఐపీఎల్ 2022 లో మరి ఎక్కువైంది. బ్యాట్ తో పరుగుల వరద పారించే కోహ్లీ ఇప్పటికే ఐపీఎల్ 2022 లో మూడు సార్లు గోల్డెన్ డక్ ఔట్ అయ్యాడు. దాంతో అతని పై విమర్శలు భారీ గానే వస్తున్నాయి. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఇండియా జట్టులో ఉంటాడా.. లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

Advertisement

ఈ ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత దక్షిణాఫ్రికా జట్టు భారత పర్యటనకు రాబోతుంది. ఈ పర్యటనలో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ జరుగుతుంది. ఈ సిరీస్ కు కోహ్లీకి విశ్రాంతిని ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లు ఓ సెలక్షన్ కమిటీ మెంబర్ పేర్కొన్నాడు. కోహ్లీకి రెస్ట్ ఇవ్వడం వల్ల అతను మళ్ళీ తిరిగి ఫామ్ లోకి వచ్చి పరుగులు చేసే అవకాశం ఉంటుంది ఆ మెంబర్ పేర్కొన్నారు.

Advertisement

అలాగే ఈ సిరీస్ తో పాటుగా ధోని తర్వాత ఐర్లాండ్ తో జరిగే సిరీస్ కు కూడా కోహ్లీని ఎంపిక చేయకూడదు అని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అయితే ఈ రెండు సిరీస్ లకు జట్టును ఎపిక చేసే ముందు కోహ్లీతో మాట్లాడి.. అతను అభిప్రాయం కూడా తీసుకుంటామని పేర్కొన్నారు. అదే విధంగా… జట్టు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని… కోహ్లీని ఎంపిక చేయాలా వద్ద అనే విషయం పైన నిర్ణయం తీసుకుంటాం అని ఆ కమిటీ మెంబర్ తెలిపారు. అదే జరిగే కోహ్లీ నేరుగా ఆగస్టులో జరిగే ఆసియా కప్ లోనే మళ్ళీ భారత జట్టులో కనిపించే అవకాశాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :

సల్మాన్ ఖాన్ తెలియదంటున్న పంజాబ్ బౌలర్..!

ఆసియా కప్ పై లంక బోర్డు కీలక వ్యాఖ్యలు..!

Visitors Are Also Reading